Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!

తనకు పాక్‌ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలంటూ ప్రధాని మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసింది.  తాను పాకిస్తాన్ కూతురిని, కానీ ఇప్పుడు భారత్  కోడలిని అని చెప్పుకొచ్చింది. 

New Update
seema-hyder modi and yogi

seema-hyder modi and yogi

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో నివాసం ఉంటున్న పాక్‌ జాతీయులు తక్షణమే దేశం వీడాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ జాతీయురాలు సీమా హైదర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు పాక్‌ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది.  ఇందులో తాను పాకిస్తాన్ కూతురిని, కానీ ఇప్పుడు భారత్  కోడలిని నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పుకొచ్చింది. 

సచిన్ మీనాతో ప్రేమలో

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన 32 ఏళ్ల సీమా హైదర్‌ తన పిల్లలను తీసుకొని 2023 మేలో కరాచీలోని తన  ఇంటి నుండి నేపాల్ మీదుగా భారత్ కు బయలుదేరింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సచిన్ మీనాతో ప్రేమలో పడిన  ఆమె ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుని అతనితోనే నివసిస్తుంది. 2019లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు ఈ జంట పరిచయం ఏర్పడగా అది ప్రేమకు దారి తీసింది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఓ సంతానం కూడా కలిగారు. సచిన్ మీనాను వివాహం చేసుకున్న తర్వాత సీమా హైదర్ హిందూ మతాన్ని స్వీకరించింది. 

Also read :  Pak Terror attack: సింధూ బంద్‌తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు

Advertisment
తాజా కథనాలు