Operation Sindoor: పాక్‌ నోట అబద్ధాల మూట..అన్నీ కూల్చేశామని ప్రగల్భాలు

మొన్నటి గొడవలోభారత్‌కు తీవ్ర నష్టం చేశామని పాకిస్థాన్‌ అబద్ధాలు మొదలు పెట్టింది. 20 భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రగల్బాలు పలికింది. కానీ అదంతా అబద్ధమని భారత ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ)తోపాటు..ఫ్యాక్ట్‌చెక్కర్లు తేల్చిచెప్పాయి.

New Update

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారతదేశం పాకిస్థాన్‌కు చెందిన 11 వైమానిక స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసంలో వైమానిక స్థావరాల్లోని ఫైటర్‌ జెట్లు, అక్కడి నిర్మాణాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. అయితే దీన్ని ఒప్పుకోవడానికి పాకిస్థాన్‌ సిద్దంగా లేదు. "అబ్బే పెద్దగా నష్టం జరగలేదంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే అమెరికాకు చెందిన ఏరోస్పేస్‌ సంస్థ ‘మాక్సర్‌ టెక్నాలజీస్‌’ విడుదల చేసిన హైరిజొల్యూషన్‌ చిత్రాల్లో పాకిస్థాన్‌కు జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో భారత్‌కు తీవ్ర నష్టం చేశామంటూ పాకిస్థాన్‌ అబద్ధాలు మొదలు పెట్టింది.భారత్‌కు చెందిన 20 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రగల్బాలు పలికింది. కానీ అదంతా అబద్ధమని భారత ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ)తోపాటు.. ఫ్యాక్ట్‌చెక్కర్లు తేల్చిచెప్పాయి. అంతేకాదు అదంపూర్‌ ఎయిర్‌ బేస్‌ రన్‌వే ధ్వంసమైందని, ఎస్‌చ 400 గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేశామని కూడా చెప్పుకుంది. అయితే ప్రధాని మోడీ అదంపూర్‌ వెళ్లి అదే రన్‌వే నిలబడి సైనికులతో మాట్లాడడంతో పాక్‌ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

Operation Sindoor

భారత్‌ అపరేషన్‌ సిందూర్‌తో తీవ్ర నష్టాన్ని చవిచూసిన పాకిస్థాన్‌ తన పౌరుల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. భారత్‌ కు తీవ్ర నష్టాన్ని కలిగించామని చెబుతూ కొన్ని వీడియోలు అక్కడి మీడియాకు విడుదల చేసింది. పాకిస్థాన్‌ మీడియా కూడా అహో..ఓహో అంటూ వాటిని ప్రసారం చేశాయి. ఆ వెంటనే జర్మనీకి చెందిన వార్తాసంస్థ డీడబ్ల్యూ అవి ఫేక్‌ వీడియోలు అంటూ తేల్చి చెప్పడంతో తోకముడిచింది. పాక్‌ సైన్యం షేర్‌ చేసిన వీడియో ఫుటేజీ 2023లో హమాస్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడులకు సంబంధించినదని తేల్చిచెప్పింది. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

ఇక ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్ తొలుతా పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడిచేసింది. దానికి ప్రతీగా పాక్‌ భారత్‌ పౌరులపై దాడి చేయడంతో భారత్‌ 9వ తేదీ అర్ధరాత్రి  హరూప్‌ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని కూడా పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. తమ  వైమానిక రక్షణ వ్యవస్థలు 26 భారత డ్రోన్లను కూల్చేశాయని, ఐదు యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేశామని పాక్‌ ఆర్మీ గొప్పలు చెప్పుకుంది. అయితే  హరూప్‌ డ్రోన్లు లక్ష్యాన్ని చేదించే క్రమంలో పేలిపోతాయి. వాటినే పాక్‌ చూపిస్తూ ప్రగల్బాలు పోవడం గమనార్హం. ఇవ్వనే కాదు పాకిస్థాన్‌కు జరిగిన విధ్వంసాన్ని చెప్పుకోవడానికి పాక్‌ సిద్ధంగా లేదు. యుద్ధ సమయంలో పాక్‌ పౌరుల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో వారిలో సడలిన విశ్వాసాన్ని కొంతైన పొందాలనే ఎత్తుగడలతో వరుస అబద్దాలు ఆడుతుంటే ఫ్యాక్ట్‌ చెక్కర్లు, శాటిలైట్‌ చిత్రాలు, విదేశీ మీడియా సంస్థలు పాక్ బండారాన్ని బయటపెడుతుండటంతో పాక్‌ ఆర్మీ అధికారులు తమ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు.

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

Also Read :  హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!

 

IND-PAK War | ind pak war | big twist In India Pak War | india pak border | india operation sindoor

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు