Taliban Conflict: పాక్‌ F-16 ఫైటర్‌ జెట్‌ను కూల్చేసిన అఫ్గానిస్థాన్‌ !.. వీడియో వైరల్

శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ వైమానిక దళాలు పాక్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ గగనతలంలోకి వచ్చిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని అఫ్గాన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Pakistan F-16 shot down amid Taliban conflict

Pakistan F-16 shot down amid Taliban conflict

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ వైమానిక దళాలు పాక్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ గగనతలంలోకి వచ్చిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని అఫ్గాన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశ భద్రతా దళాలను ఉటంకిస్తూ అక్కడి మీడియా పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇది ఫేక్ వీడియో అని పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీడియోలో కనిపిస్తున్న విమానానికి, F16 ఫైటర్ జెట్‌కు అసలు పోలికే లేదని పేర్కొన్నాయి. - Taliban Conflict

Also Read: లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

Pak F-16 Shot Down Amid Taliban Conflict?

అఫ్గాన్ దళాలకు దీటుగా తమ సైన్యం స్పందిస్తోందని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. మరోవైపు సరిహద్దుల్లో దాడులు జరుగుతుండగా పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిప్‌ భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్నారు. అఫ్గాన్‌ భారత్‌లో ఓ కాలనీగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. తాలిబన్లు ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులందరినీ పోగేసి ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

Also Read: ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు.. పాకిస్థాన్, అఫ్గాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు ఇవే !

Advertisment
తాజా కథనాలు