ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు.. పాకిస్థాన్, అఫ్గాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు ఇవే !

ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పాక్ వైమానిక దళాలు అఫ్గానిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
From Allies to Adversaries, the Collapse of Pakistan-Afghanistan Relations

From Allies to Adversaries, the Collapse of Pakistan-Afghanistan Relations

ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పాక్ వైమానిక దళాలు అఫ్గానిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. ఈ ఘటనలో అఫ్గాన్ ఆర్మీ పోస్టులు ధ్వంసమైపోయాయి. సరిహద్దు వెంట పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, అంతకుముదు అఫ్గాన్ దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పాక్ రక్షణశాఖ వెల్లడించింది. అఫ్గాన్‌లోని కాబూల్, కాందహార్, పక్తికా వంటి నగరాల్లోని సైనిక పోస్టులు, శిక్షణ శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్‌కు చెందిన 55 మంది సైనికులే ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్ తెలిపింది. దీన్ని పాకిస్థాన్ ఖండించింది. ఇద్దరు పాక్‌ సైనికులే మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. అఫ్గాన్‌ సైనికులే 133 మంది చనిపోయారని.. 200 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? దీని వెనకున్న వివాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read: పోలీసులకు లొంగిపోతానన్న మావోయిస్టు హత్య

డ్యూరాండ్ లైన్ వివాదం

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉన్న సుమారు 2,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దీన్ని 'డ్యూరాండ్ లైన్' అని పిలుస్తారు. ఇదే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు మూలకారణం అయ్యింది.1893లో బ్రిటిష్ ఇండియా అధికారి సర్ మోర్టిమర్ డ్యూరాండ్, అఫ్గాన్‌కు చెందిన అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య ఈ సరిహద్దు ఒప్పందం జరిగింది. అయితే ఇది కేవలం 100 ఏళ్ల వరకు మాత్రమే ఉన్న ఒప్పందంమని అఫ్గాన్ వాదిస్తోంది. 1993తోనే దీని గడువు ముగిసిందని చెబుతోంది. ఈ లైన్ పష్టూన్ తెగలను రెండుగా విడదీసిందని, అసలు పాకిస్తాన్‌తో తమకు సరిహద్దే లేదని తాలిబన్లు అంటున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ దీనిపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయంగా గుర్తించబడిన సరిహద్దు ఇదేనని.. దీన్ని ఎవరూ మార్చలేరని తేల్చిచెబుతోంది.

TTP (తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్) అంశం

పాకిస్తాన్‌లో ఇస్లామిక్ పాలన రావాలని టీటీపీ ఉగ్రవాదులు పోరాడుతున్నారు. ఇది కూడా ఈ యుద్ధానికి మరో ప్రధాన కారణం. పాకిస్తాన్‌లో జరుగుతున్న వరుస బాంబు దాడులు, సైనిక దాడుల వెనుక TTP ఉందని పాక్‌ ఆరోపిస్తోంది. వీళ్లకి అఫ్గాన్ తాలిబన్లు ఆశ్రయం ఇస్తున్నారని చెబుతోంది. మీ దేశంలో మా శత్రువులకు స్థానం కల్పించడం అంటే మాపై యుద్ధం ప్రకటించడమేనని పాక్ రక్షణశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు తమ భూభాగం నుంచి ఎలాంటి దాడులు జరగలేదని అఫ్గానిస్థాన్ అంటోంది. 

సరిహద్దు కంచె వివాదం

సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లు పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ భారీ ఖర్చుతో కంచె నిర్మిస్తోంది. అయితే దీన్ని అఫ్గాన్ తాలిబన్లు వ్యతిరేకిస్తున్నారు.  డ్యూరాండ్ లైన్‌ను తాము గుర్తించడం లేదని.. అలాంటప్పుడు కంచె ఎలా వేస్తారని వారు నిలదీస్తున్నారు. గత రెండేళ్ల నుంచి తాలిబన్ సైనికులు అనేక చోట్ల ఈ కంచెను పడగొట్టడం, కాల్పులు జరగడం సాధారణం అయిపోయింది. 

Also Read: ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. 420 డ్రోన్లు, 39 మిసైల్స్‌తో విరుచుకుపడ్డ రష్యా

ప్రస్తుతం చూసుకుంటే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఉంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశభక్తిని అడ్డం పెట్టుకొని ప్రజల దృష్టిని మార్చేందుకే ఈ ఘర్షణలు వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు