BIG BREAKING: లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది.

New Update
Kavita and kejriwal

Kavita and kejriwal

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది. ఈ కేసులో కవితకు పూర్తిస్థాయిలో క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు పేర్కొంది. కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కోర్టు కేసులు కొట్టివేసింది. వాళ్లందరి పేర్లు డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా ఈ కేసులో వాళ్ల పేర్లు ఇరికించినట్లు మండిపడింది. మొత్తంగా ఈ కేసులో అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 

Also Read: కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?

గత రెండేళ్లుగా ఈ కేసుపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కవిత, కేజ్రీవాల్, సిసోడియా బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చారు. తాజాగా కోర్టు వారిపై ఉన్న కేసు కొట్టివేయడంతో వాళ్ల అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also read: ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్

2021, నవంబర్ 17న ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో 2022 సెప్టెంబర్‌లో ఈ పాలసీని రద్దు చేసింది. ఇందులో ఆప్‌ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్‌ పాలసీలో సవరణలు చేసేటప్పుడు వీళ్ల అక్రమాలకు పాల్పడ్డట్లు ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. లైసెన్స్‌ కావాలనుకునే వారినుంచి అక్రమంగా నగదు తీసుకున్నట్లు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై నుంచి విడుదలయ్యారు.  

Advertisment
తాజా కథనాలు