/rtv/media/media_files/2025/11/09/denmark-agrees-to-ban-social-media-for-children-under-15-2025-11-09-15-25-16.jpg)
Denmark agrees to ban social media for children under 15
స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ లాంటి యాప్స్‌ను కనీసం ఒక్కరోజు కూడా ఓపెన్ చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అయితే పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్యదేశమైన డెన్మార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: బ్రెజిల్‌లో టోర్నడో బీభత్సం.. 4 వందల మంది!
15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకురానుంది. దీని ప్రకారం.. 13 ఏళ్లు దాటిన పిల్లలు పేరెంట్స్ అనుమతితో సోషల్ మీడియా వాడేందుకు కొన్ని షరతులతో అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హింస, లైంగిక వేధింపులు, స్వీయ హాని లాంటి ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెన్మార్క్ డిజిటల్ అఫైర్స్ మంత్రి కరోలినా వెల్లడించారు.
Also Read: బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!
ఇదిలాఉండగా ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా 15 ఏళ్లు లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల పర్మిషన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టాన్ని ఆమోదించింది. అలాగే ఆస్ట్రేలియా కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. మరోవైపు భారత్ సహా మరికొన్ని దేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కనీస వయస్సును 13 ఏళ్లుగా నిర్ణయించాయి.
Follow Us