UAE: యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయుల విడుదల!

భారత్‌ తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.రంజాన్‌ సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వారే సుమారు 500 మందికి పైగా ఉన్నారు.

New Update
Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

arrest

భారత్‌ తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌ కు చెందిన వారే సుమారు 500 మందికి పైగా ఉండగా...వారంతా కూడా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం అందింది.

Also Read: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

రంజాన్‌ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ అక్కడి జైళ్లలో ఉన్న 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ప్రధాని షేక్‌ మోహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూడా 1518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!

దుబాయ్‌ లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్‌,ఛాన్సలర్‌ ఎస్సమ్‌ ఇస్సా అల్‌ హుమైదాన్‌ ప్రకటన విడుదల చేశారు. రంజాన్‌ సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం..విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది.

సత్ప్రవర్తనను ఆధారంగా...

అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆ  ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: Pastor Praveen: సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అధిపతి.. వందలాది అనాథలకు ఆశ్రయం.. పాస్టర్ ప్రవీణ్ బ్యాగ్రౌండ్ ఇదే!

Also Read:Pithapuram Recording Dance: పవన్ ఇలాకాలో అశ్లీల డ్యాన్సులు.. 12 మంది అమ్మాయిలతో- వీడియో చూశారా?

bharat | arrest | uae | eid | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు