Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి సపోర్ట్ చేస్తా.. కిమ్ సంచలన ప్రకటన

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి మద్దతిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.

New Update
Vladimir Putin and Kim Jong Un

Vladimir Putin and Kim Jong Un

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి మద్దతిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. బుధవారం పాంగ్యాంగ్‌లో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కీవ్‌తో యుద్ధం చేసేందుకు తాము ఎలాంటి షరతుల్లేకుండానే సపోర్ట్ చేస్తున్నామని కిమ్ వ్యాఖ్యానించారు. 

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంతో పాటు అన్నీ విషయాల్లో రష్యా వైఖరినీ, ఆ దేశ విదేశాంగ విధానాలకు ఉత్తర కొరియా మద్దతిస్తోందని తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇతర అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే కుర్క్స్‌ ప్రాంతం పునర్‌నిర్మించే అంశంపై కూడా మాట్లాడారు. అయితే రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.

Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్‌

మార్చిలో ఉత్తర కొరియాకు వచ్చిన ఆయన కిమ్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో కూడా రష్యాకు కిమ్ జోంగ్ ఉన్‌ మద్దతిచ్చారు. రష్యా తమ సార్వభౌమాధికాన్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటానికి తాము సపోర్ట్ చేస్తామని చెప్పారు.  మరోవైపు రష్యా తరఫున తమ బలగాలు ఉక్రెయిన్‌తో పోరాడుతున్నాయని ఏప్రిల్‌లోనే ఉత్తర కొరియా ప్రకటించింది. రష్యా-ఉత్తర కొరియా మధ్య జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కానీ ఎంతమంది సైనికులను పంపిచామనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాదాపు 10 వేల మందికి పైగా ఉత్తర కొరియా బలగాలు ఉండొచ్చని.. ఉక్రెయిన్ నిఘా సంస్థ గతంలోనే పేర్కొంది. అయితే ఇందుకు ప్రతిఫలంగా రష్యా అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతను కిమ్‌కు అందిస్తున్నట్లు సమాచారం.

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

Also Read: విషాదం.. ఇంజెక్షన్‌ వికటించి అయిదుగురు మృతి..

 

Advertisment
Advertisment
తాజా కథనాలు