North Korea: జపాన్‌లో టెన్షన్, టెన్షన్‌.. నార్త్‌ కొరియా క్షిపణలు ప్రయోగం..

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఊహించని షాక్ ఇచ్చింది. జపాన్ భూభాగంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలోనే జపాన్ అలెర్ట్ అయ్యింది.

New Update
North Korea

North Korea

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా(north-korea) ఊహించని షాక్ ఇచ్చింది. జపాన్(japan) భూభాగంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలోనే జపాన్ అలెర్ట్ అయ్యింది. అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి జపాన్ మీడియా కీలక విషయాలు వెల్లడించింది. జపాన్ సముద్ర తీరం నుంచి 200 మైళ్ల దూరం వరకు ఆ దేశానికి చెందిన జలాలుగానే పరిగణిస్తారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు జపాన్‌ భూభాగంలో పడ్డాయి. ఆ దేశ రక్షణశాఖ మంత్రి కోయిజుమి చెప్పారు.  

Also Read: ఒలింపిక్స్‌-2036 గేమ్స్‌ నిర్వహించేందుకు సిద్ధం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

North Korea Launches Missiles

ఈ మిసైల్స్ దాదాపు 950 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశాయన్నారు. అమెరికా, జపాన్‌ దేశాలకు సంబంధించి రక్షణ స్థావరాలతో సహా దక్షిణ జపాన్‌లోని చాలా ప్రాంతాలను అవి చేరగలవని తెలిపారు. ఈ క్రమంలోనే జపాన్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నార్త్‌ కొరియా జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనిపై జపాన్‌ కూడా చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.  

Also Read: కోతులకు భయపడుతున్న MLAలు.. అసెంబ్లీలో మిమిక్రీ ఆర్టిస్టుల నియామకం

అంతేకాదు అమెరికా(america) కు కీలక సైనిక స్థావరాలు కూడా జపాన్‌లో ఉన్నాయి. అమెరికా, ఉత్తరకొరియాకు శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే జపాన్‌తో కూడా ఉత్తర కొరియా దూరంగా ఉంటుంది. మరోవైపు వెనెజువెలాపై అమెరికా దాడి చేయడాన్ని ఉత్తర కొరియా కూడా ఖండించింది. ఇలా చేసి అమెరికా తన క్రూరస్వభావాన్ని మరోసారి బయటపెట్టిందని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Advertisment
తాజా కథనాలు