/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
ఆపరేషన్ లయన్ పేరిట ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. మరోవైపు నుంచి అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాల మీద అటాక్ చేస్తోంది. వీటికి ధీటుగా ఇరాన్ జవాబు చెప్తోంది. కానీ ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రం ఎవ్వరికీ దొరక్కుండా తల దాచుకున్నారు. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఆయన బంకర్లలో కుటుంబ సమేతంగా తల దాచుకున్నారని చెబుతున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఖమేనీ ఎక్కడున్నారో చాలా కొద్ది మంది అధికారులకు తప్ప ఎవరికీ తెలియదుట. ఐఆర్జీసీ లోని కీల ఉన్నతాధికారులకు కూడా ఖమేనీ ఎక్కడున్నారో తెలియదని చెబుతున్నారు.
Also Read: అమెరికా మరో సంచలన నిర్ణయం.. ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం బిగ్ అలెర్ట్!
24 గంటల భద్రతతో..
ఖమేనీ ఎవరికీ తెలియని అత్యంత రహస్య, ఉన్నతస్థాయి విభాగం ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. ఆయనను హత్య చేయొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదీ కాక ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఇప్పటికే తమ ప్రభుత్వంలోని వివిధ స్థాయుల్లోకి చొరబడినట్లు ఇరాన్ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే సుప్రీం లీడర్ ఖమేనీ భద్రత కోసం తెలియని అత్యంత రహస్య యూనిట్ ను రంగంలోకి దించారని చెబుతున్నారు. ఈ యూనిట్ 24 గంటలూ కాపాడుతున్నాయని తెలుస్తోంది.
మామూలుగానే ఖమేనీ టెహ్రాన్ లోని అత్యంత సురక్షితమైన బీత్ రహర్బీ అనే ప్రదేశంలో ఉంటారు. అక్కడ నుంచే విధులు నిర్వహిస్తారు. చాలా అరుదుగానే బయటకు వస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రదేశం కూడా సురక్షితం కాదని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఖమేనీ నివాసంతోపాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. చాలా మంది సీనియర్ అధికారులను, అణుశాస్త్రవేత్తలను మట్టుబెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీయే తమ లక్ష్యం..ఆయనను మట్టుబెడితే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చాలా సార్లు చెప్పారు.
Also Read: Stock Market: స్టాక్ మార్కెట్ పై బలంగా వార్ దెబ్బ..25 వేల దిగువకు నిఫ్టీ