Donald Trump: కొనాల్సిన అవసరం లేదు...స్వాధీనం చేసేసుకుంటాం!

అమెరికా గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఆలోచన అమెరికాకు లేదని అన్నారు.

New Update
Donald Trump

Donald Trump

Donald Trump: గాజా(Gaza)ను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2 తో భేటీ అయిన ట్రంప్‌. ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. మేము గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తాం.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఆలోచన నాకు లేదు.మధ్యప్రాచ్యంలోని ప్రజలకు అనేక ఉద్యోగాలు సృష్టించనున్నాం అని ట్రంప్‌ ఓవెల్‌ కార్యాలయంలో విలేకరులతో తెలిపారు.యుద్ధం కారణంగా అనారోగ్యంతో క్యాన్సర్‌ తో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను తమ దేశానికి తీసుకెళ్తామని అబ్ధుల్లా 2 ప్రకటించారు.

Also Read:  Trump-musk:మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

దీనిని ట్రంప్‌ అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. అయితే నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించాలనే ప్రతిపాదనను మాత్రం జోర్దాన్‌ రాజు తిప్పి కొట్టారు.వారిని అక్కడి నుంచి పంపించకుండా గాజాను తిరిగి నిర్మించాలన్నారు. ట్రంప్‌ ప్రతిపాదన పై అరబ్‌ దేశాలు రియాద్‌ లో చర్చిస్తాయన్నారు. అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను గత వారం తొలిసారి ట్రంప్‌ బయటపెట్టారు.

ఓ విప్లవాత్మక ఆలోచన..

నాడు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.దానిని స్వాధీనం చేసుకొని..ఓ వెకేషన్‌ ప్రదేశంగా అభివృద్ది చేస్తామని వ్యాఖ్యానించారు. నాడు నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక ఆలోచనగా అభివర్ణించారు.

హమాస్‌ మాత్రం ట్రంప్‌ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది.కొనుగోలు చేసి..అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదు. అది మా పాలస్తీనాలో విడదీయలేని భాగం అని పేర్కొంది.ఈ ప్రకటనకు ముందు గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు అరబ్‌ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్‌ ప్రతిపాదించారు.

అయితే ఈ ప్రతిపాదనను ఆ దేశాలు ఖండించాయి. తమ మిత్రదేశమైన ఈజిప్ట్‌, జోర్దాన్‌ లు శరణార్థులకు ఆశ్రయం ఇస్తాయని వైట్‌హౌస్‌ ప్రతినిధి కారోలైన్‌ లెవెట్టి తెలిపారు. మరో వైపు..దీనికి వారు నిరాకరిస్తే అమెరికా నుంచి అందే సాయం నిలిపివేస్తామంటూ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే అబ్దుల్లా 2 ట్రంప్‌ తో భేటీ అయ్యారు.

Also Read:Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!

Also Read: Flights to Prayagraj: ప్రయాగ్‌రాజ్‌ వెళ్లడం కంటే..లండన్‌,బ్యాంకాక్ ఈజీగా వెళ్లి వచ్చేయోచ్చు!

Advertisment
తాజా కథనాలు