/rtv/media/media_files/2024/12/31/0j2EHuGYyqzn3WyhEibx.jpg)
Nimisha Priya Death Penalty Photograph: (Kerala nurse sentenced to death in Yemen)
కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ఉరిశిక్షను ఖరారు చేసింది. ఆదేశ అధ్యక్షుడి ఆమోదంతో ఈ నెల 16న ఈ శిక్షను యెమెన్ దేశం అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ తెలిపారు. గతంలో నిమిష ఉరిశిక్షపై క్షమాభిక్షను భారత విదేశాంగ శాఖ కోరగా అందుకు ఆదేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి తిరస్కించారు. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైలులో ఉన్నారామే. 2017లో వ్యాపార భాగస్వామిని నిమిష హత్య చేయగా.. 2020లో మరణ శిక్ష విధించింది యెమెన్ కోర్టు. నిమిష ప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్. 2008లో యెమెన్‌కు వెళ్లింది. యెమెన్ హాస్పిటల్స్‌లో నర్సుగా పని చేసింది. తర్వాత చిన్న క్లినిక్ ప్రారంభించింది. యెమెన్‌లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి కంపల్సరీగా ఉండాలి.
Also Read : కాంగ్రెస్కు బిగ్ షాక్.. శశిథరూర్ ఔట్ !
నిమిషను తప్పించేందుకు ప్రయత్నాలు..
ఉరిశిక్ష పడిన కేరళ నర్స్ ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే నిమిష ప్రస్తుతం హౌతీ తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉన్న సనాలోని జైల్లో ఉన్నారు. భారత్ కు, హౌతీ తిరుగుబాటు దారులకు ప్రత్యక్ష అధికార సంబంధాలు లేకపోవడం వల్లన ఆమె కేసు చర్చలు కష్టంగా మారుతున్నాయి. పైగా హౌతీ పరిపాలన తాలూకా సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ కూడా 2024 లో ఆమె మరణశిక్షను సమర్థించింది. మరోవైపు నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బ్లడ్ మనీ ద్వారా వారిని ఒప్పించాలని చూస్తున్నారు.
Also Read : హైదరాబాద్ లో యాసిడ్, కెమికల్స్ తో పాలు.. ఆ ఎరియాల్లో అమ్మకాలు.. షాకింగ్ వీడియోలు!
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క ఓపెన్
బ్లడ్ మనీ అంటే ఏంటి..
నిమిష ేతుల్లో చిపయిన మెహదీ కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వడం ద్వారా ఆమెను శిక్ష నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగుతున్నాయి. బ్లడ్ మనీ దీనినే ఇస్లామిక్ షరియా చట్టంలో 'దియ్యా' అని కూడా పిలుస్తారు. యెమెన్ లో షరియా చట్టం అనుసరిస్తారు. దీని ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారాన్ని అందిస్తారు. దీంట్లో బాధిత కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడంతో పాటూ ప్రయాణ ఖర్చుల్ని కూడా భరిస్తారు. ఇదే కాక మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే దీనిపై మెహదీ కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు. నిమిషాను కాపాడ్డానికి ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గం ఉంది. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఆమెకు ఉరిశిక్ష పడడం ఖాయం.
Also Read: NASA: ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..
Nimisha Priya | nurse | yemen | today-latest-news-in-telugu