/rtv/media/media_files/2025/07/10/sot-police-2025-07-10-12-12-27.jpg)
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు రోజుకో గ్లాసు తాగాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. మార్కెట్లో కూడా పాలకు మంచి డిమాండ్ ఉంది. దీన్నే ఆసరాగా చేసుకోని కొంతమంది దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో కొంతమంది వ్యాపారులు జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ పాలతో జనాలను మోసం చేయడమే కాకుండా వారి ప్రాణలను తీస్తున్నారు.
Case 1 🔴 కల్తీపాలు... భువనగిరి జోన్ పరిధిలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసుల దాడులు మొన్నేవరిపంపు గ్రామంలో 80...
Posted by Journalist Satish Kumar on Wednesday, July 9, 2025
సామల సత్తి రెడ్డి అరెస్ట్
తాజాగా భువనగిరి జోన్ పరిధిలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసుల దాడులు నిర్వహించారు. మొన్నేవరిపంపు గ్రామంలో 80 లీటర్ల కల్తీ పాలు, 500ML హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్, 5 మిల్క్ పౌడర్స్ ,400ML యాసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సామల సత్తి రెడ్డి అరెస్ట్ చేశారు. ఇతగాడు ఎల్బీనగర్, ఉప్పల్ లోని స్వీట్ షాపులకు కల్తీ పాలు సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుడు సామల సత్తిరెడ్డిను భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు ఎస్వోటీ పోలీసులు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.