New Coronavirus Strain: వామ్మో.. అమెరికాలో కొత్త రకం కరోనా.. లక్షణాలు ఏంటో తెలుసా..?

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ కొత్తగా ఉద్భవించింది. దీనికి స్ట్రాటస్ అని పేరు పెట్టారు. ఇది శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ బిగుతుగా అనిపించడం, గొంతు, తల, ఒళ్ళు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ వేరియంట్‌లో కనిపిస్తున్నాయి.

New Update
Stratus virus

Stratus virus

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కొత్తగా ఉద్భవించిన XFG వేరియంట్, దీనికి స్ట్రాటస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ ఈ సంవత్సరం జనవరిలో తొలిసారిగా ఆగ్నేయాసియాలో గుర్తించబడింది. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఇది జూన్ నాటికి 38 దేశాలకు వ్యాప్తి చెందింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. భారతదేశంతో సహా ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న స్ట్రాటస్ (XFG) వేరియంట్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.   

వేగంగా విస్తరిస్తున్న స్ట్రాటస్:

గతంలో వచ్చిన నింబస్ (Nimbus) వేరియంట్ చాలా వేగంగా సంక్రమించి.. గొంతు నొప్పిని తీవ్రంగా కలిగించింది. ఇప్పుడు స్ట్రాటస్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తూ భిన్న రూపాల్లో లక్షణాలను చూపుతోంది. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ వంటి 9 రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు అకస్మాత్తుగా పెరిగాయని US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) తెలిపింది. ఇది శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ బిగుతుగా అనిపించడం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, వాంతులు లేదా వికారం, మానసిక అలసట, ఏకాగ్రత లోపం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ వేరియంట్‌లో కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఇలాంటివి మీ నిత్యకృత్యాల్లో ఉన్నాయా..? అయితే మీ బొక్కలు డొల్ల కావడం ఖాయం..!!

వైద్యుల సలహా మేరకు యాంటీ వైరల్ మందులు తీసుకోవచ్చు. ప్రారంభ లక్షణాలకు వేడి నీరు తాగడం.. ఆవిరి పట్టడం, పసుపు పాలు తాగడం వంటి ఇంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. జ్వరం, నొప్పికి సాధారణ మందులు వాడవచ్చు.. కానీ డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవద్దు. తగినంత విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంటుందని.. అందుకే మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడమే ఉత్తమ చికిత్స అని నిపుణులు సూచిస్తున్నారు.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: సంగీతం వింటే ఎంత హాయిగా ఉంటుందో..!!

Advertisment
తాజా కథనాలు