/rtv/media/media_files/2025/09/02/laurent-freixe-2025-09-02-09-41-03.jpg)
Laurent Freixe
చిన్నచిన్న బలహీనతులు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకు చెరగని మచ్చను మిగుల్చుతున్నాయి. అనేక ఏండ్లుగా సంపాదించుకున్న గుడ్‌విల్‌ను ఒక చిన్న సంఘటన మసకబారేలా చేస్తున్నాయి. తన కింది స్థాయి ఉద్యోగితో ఎఫైర్ నడిపిన వ్యవహారంలో నెస్లే సీఈవో లారెంట్ ఫ్రీక్సే(Nestle CEO Laurent Freixe) తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. తన సబార్డినేట్‌తో అక్రమ సంబంధం వ్యవహారమే ఈ సీఈఓ కొంప ముంచినట్లు తెలిసింది. ఉద్యోగితో సీక్రెట్ రిలేషన్‌షిప్(illicit-relationship) పెట్టుకున్నట్లు రుజువు కావడంతో లారెంట్ ఫ్రెక్సీని సంస్థ విధుల నుంచి తొలగించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపట్టిన సంస్థ ఆరోపణలు నిజమని తేలడంతో సీఈఓను ఇంటికి పంపించి వేసింది.
Also Read : భారత్ లో రష్యా యుద్ధ విమానాలు..పాక్ కు ఇక మూడినట్టే..
Nestle CEO Fired Relationship With Employee
ఇలాంటి వ్యవహారాలు నెస్లే నిబంధనలకు వ్యతిరేకమని సంస్థ వివరించింది. సంస్థ నియమావళిని ఉల్లంఘించడం వల్లే ఫ్రెక్సీని తొలగించినట్టు నెస్లే సంస్థ స్పష్టం చేసింది. ఆయనపై ఆరోపణలు రావడంతో జరిపిన అంతర్గత దర్యాప్తులో ఫ్రెక్సీ సంబంధం గురించి నిజం తెలిసిందని పేర్కొంది. ఈ దర్యాప్తును సంస్థ చైర్మన్ పాల్ బల్కీ స్వయంగా పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఆరోపణల నేపథ్యంలో సీఈఓను తొలగించకతప్పలేదని చైర్మన్ పాల్ బల్కీ పేర్కొన్నారు. దీనిపై ఛైర్మన్ పాల్ బుల్కే, ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఇస్లా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుందని తేల్చి చెప్పింది. నెస్లే పాలన వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవని, అన్ని పనులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. నైతిక విలువలు, పరిపాలనా విధానమే సంస్థకు బలమైన పునాదులని వివరించింది. తమ విలువలు కంపెనీకి బలమైన పునాదులని పాల్ బుల్కే ఈసందర్భంగా తేల్చి చెప్పారు.కాగా, ఫ్రెక్సీ స్థానంలో నెస్లే సీనియర్ ఉద్యోగి ఫిలిప్ నవ్రాటిల్ ను నియమించనున్నారు. నవ్రాటిల్ 2001లో ఇంటర్నల్ ఆడిటర్‌గా సంస్థలో చేరారు. సెంట్రల్ అమెరికా కార్యకలాపాలకు సంబంధించి పలు బాధ్యతలు చేపట్టారు. 2020లో సంస్థకు చెందిన కాఫీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్‌కు బదిలీ అయ్యారు. 2024లో నెస్లే నెస్‌ప్రెస్సో విభాగం బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, స్విట్జర్లాండ్(Switzerland) కు చెందిన ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే(Nestle) కొంత కాలంగా వ్యాపారంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అధిక సుంకాలు, ముడిసరుకు ధరల పెరుగుదల సంస్థకు ఇబ్బందిగా మారాయి. కాఫీ, కొకోవా గింజలు వంటి ముడిసరుకుల ధరల పెరిగింది. అదే సమయంలో తుది ఉత్పత్తలు ధరలు కూడా పెరగడంతో సంస్థపై కొంత భారం తగ్గిందని నెస్లే పేర్కొంది. ఇటీవల ఆస్ట్రానమర్ సంస్థ సీఈఓ యాండీ బ్రయన్ కూడా ఇలాంటి ఎఫైర్ వార్తల తోనే ఇదే ఉద్యోగం పోగొట్టుకున్నాడు. హెచ్ ఆర్ విభాగం అధిపతితో ఆయనకు వివాహేతర సంబందం ఉన్నట్లు ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో బయటపడింది. ఆ కార్యక్రమంలో హెచ్ఆర్ అధిపతిని ఆయన కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఆయన స్టేడియంలోని కెమెరా కంటికి చిక్కారు. దీంతో, వెంటనే తల పక్కకు తిప్పుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో చివరకు ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
Also Read : పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్\