H1-B Visa: భయపడకండి.. భారత్‌కు తిరిగి రండి.. H1-B వీసా హోల్డర్లకు నిపుణుడి పిలుపు!

డొనాల్డ్ ట్రంప్ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే హెచ్‌1 బీ వీసాపై ఉంటున్న భారతీయులకు సమయం వచ్చిందని అనుకుంటున్నానని శ్రీధర్ అన్నారు. ఇది కాస్త బాధాకరమైన విషయమే.. కానీ భారత్‌కు వచ్చేయండని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

New Update
Sridhar Vembu

Sridhar Vembu

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాపై కొత్త రూల్స్ తీసుకురావడంతో అక్కడ ఉంటున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నారైలు భారత్‌కు తిరిగి రావాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా ఈ ట్వీట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Donald Trump: H-1B వీసా ఫీజుల పెంపునకు కారణం అదే.. !

హెచ్‌ 1 బీ వీసా మార్పుల వల్ల..

దేశం విడిపోయే సమయంలో అన్ని వదులుకుని కట్టుబట్టలతో భారత్‌కు ఎలా వచ్చారనే విషయాన్ని తన సింధీ స్నేహితులు చెబితే విన్నాని శ్రీధర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు తమ జీవితాలను మళ్లీ పునర్నించుకున్నారని అన్నారు. జీవితంలో ఎదిగి.. స్థిరపడ్డారని అతను తెలిపారు. అయితే అమెరికాలో హెచ్‌1 బీ వీసాపై ఉంటున్న భారతీయులకు కూడా సమయం వచ్చిందని అనుకుంటున్నానని శ్రీధర్ అన్నారు. ఇది కాస్త బాధాకరమైన విషయమే.. కానీ భారత్‌కు వచ్చేయండి. మళ్లీ మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించుకోండి. దీనికి మీకు కనీసం 5 ఏళ్లు పట్టవచ్చు. కానీ మళ్లీ మీరు స్ట్రాంగ్ అవుతారని అన్నారు. భయంతో జీవించవద్దు.. ధైర్యంగా ముందడుగు వేయండి. ఎలాంటి సమస్య ఉండదని శ్రీధర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

ఇది కూడా చూడండి: China New Visa: అమెరికా హెచ్ 1బీ వీసాకు పోటీగా చైనా కె వీసా.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

ఈ పోస్టు నెట్టింట వైరల్ కావడంతో కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఇలా పోస్టులు పెట్టకూడదని అంటున్నారు. అక్కడ హెచ్ 1బీ వీసాపై ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. కొత్తగా వెళ్లాలని అనుకునే వారికి ఈ రూల్స్ వర్తిస్తాయని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ‘సింధీల వల్లే బెంగాలీలు, పంజాబీలు కూడా కష్టపడ్డారు. వారు ఈ స్థితికి రావడానికి దాదాపుగా మూడు తరాలు పట్టిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు శ్రీధర్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దేశంలో  ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చేయమని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. 

Advertisment
తాజా కథనాలు