Humanoid Robot: అందరినీ ఆశ్చర్యపరుస్తున్న హ్యూమనాయిడ్ రోబో.. అచ్చం మనిషిలానే

చైనాలో తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటుచేసిన ఓ హ్యుమనాయిడ్ రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివిధ భాషల్లో అతిథులు, జర్నలిస్టులతో మాట్లాడుతోంది.

New Update
Meet Xiao He, Humanoid Robot To Assist Journalists At SCO Summit In China

Meet Xiao He, Humanoid Robot To Assist Journalists At SCO Summit In China

Humanoid Robot:

చైనాలో తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ ( SCO Summit) శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు మరో 25 దేశాల అగ్రనేతలు హాజరుకున్నారు. తాజాగా ప్రధాని మోదీ కూడా చైనాకు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటుచేసిన ఓ హ్యుమనాయిడ్ రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివిధ భాషల్లో అతిథులు, జర్నలిస్టులతో మాట్లాడుతోంది.  

Also Read: చైనాలో అడుగుపెట్టిన మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి !

'' నా పేరు షియావో హి. షాంఘై సదస్సు కోసం రూపొందించిన అత్యాధునిక ఏఐ సాంకేతికత కలిగిన రోబోని. నేను బహుభాషలు మాట్లాగలను. రియల్‌టైమ్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాను. ప్రోటోకాల్- కంప్లైంట్ ఇంటరాక్షన్ సామర్థ్యాలను అందిస్తాను. ఈ సదస్సుకు వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులు, మీడియా సిబ్బంది, నిర్వాహకుల మధ్య సజావుగా కమ్యూనికేషన్‌ను సులభతరం చేసేందుకు నా సిస్టమ్స్‌లో అధునాతన భావోద్వేగ గుర్తింపు ,అల్గోరిథంలు, అనుకూల అభ్యాస మాడ్యూల్స్, సమగ్ర జ్ఞాన డేటాబేస్‌లను పొందుపరిచారు. నా కార్యాచరణ పరిమితులు సాంస్కృతిక నిస్పాక్షికత, నిజమైన సమాచారం, శిఖరాగ్ర సదస్సు సమయంలో నిరంతర పనితీరు మెరుగుదలపై దృష్టి సారిస్తాయి. నాకు మూడు భాషల్లో( చైనీస్‌, ఇంగ్లీష్‌, రష్యన్‌) ప్రావీణ్యం ఉంది. ఈ సదస్సులోని 'ఇంటాన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ జోన్'లో తియాంజిన్ యాంగ్‌లియూ‌చింగ్, వుడ్‌బ్లాక్ ముద్రణలు, సంప్రదాయ కళల ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యకలాపాలను ప్రదర్శించనున్నారని'' ఆ రోబో వివరించింది. 

Also Read: పాఠశాల మరుగుదొడ్డిలో 9వ తరగతి విద్యార్థిని ప్రసవం..

అలాగే మీడియా సెంటర్లో వాలంటీర్లు ఐస్‌క్రీమ్‌లు అందించేందుకు కూడా మరో రోబోను ఏర్పాటు చేశారు. ఇంకా అనేక పనుల్లో సేవలు అందించేందుకు రోబోలను తీసుకొచ్చారు. ప్రస్తుతం చైనాలో రోబోల సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఏకంగా హ్యూమనాయిడ్ రోబోలతో ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్స్‌లో దాదాపు 16 దేశాలకు చెందిన 280 టీమ్‌లు పాల్గొన్నాయి. ఫుట్‌బాల్, బాక్సింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు, టెన్నిస్‌ లాంటి పోటీలు నిర్వహించారు. అలాగే వస్తువులు తీసుకెళ్లడం, ఔషధాలను గుర్తించడం, క్లీనింగ్ సర్వీసెస్ వంటి విభాగాల్లో కూడా రోబోలు పాల్గొన్నాయి. 

Also Read: వివాదంలో ఇరుక్కున్న మెటా.. సెలబ్రిటీల అసభ్యకరమైన ఫొటోలపై విమర్శలు

Advertisment
తాజా కథనాలు