/rtv/media/media_files/2025/05/20/lnyTpnVyIEr1UQvYVToK.jpg)
హనీ ట్రాప్ అనే పదం చాలా తక్కువ సందర్భాల్లో వింటుంటాము. స్త్రీలు వారి అందచందాలతో వాళ్లకు కావాల్సినది దక్కించుకునే విధానమే హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్‌తో దేశ భద్రత సంబంధించిన రహస్యాలను కూడా చేధిస్తున్నారు. లేడీస్ వీక్‌నెస్‌ని ఉపయోగించుకొని కొందరు ఆర్మీ అధికారులను ట్రాప్ చేస్తారు. దేశ సీక్రెట్ డేటా, ఆర్మీ ఆపరేషన్స్ సమాచారాన్ని వలలో వేసుకొని రాబడుతారు. ఇలాంటి వారిలో మొదటి ప్రపంచ యుద్ద సమయంలో ఓ డచ్ డ్యాన్సర్ ప్రసిద్ధి. ఇండోనేషియాకు చెందిన మతా హరి అనే మహిళ గూఢాచారిగా పని చేసింది. ప్రపంచంలోనే మొదటి మహిళ గూడఛారి ఈమెనే. అసలు పేరు మార్గరెథా గీర్ట్రూయిడా జెల్లె.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!
After courtesan, Mata Hari (1876-1917), was shot for espionage, no one claimed her body. Her head was sent to the Paris Institute of Anatomy pic.twitter.com/vA8Oois9TP
— Whores of Yore (@WhoresofYore) March 8, 2017
1876 ఆగస్టు 7న నెదర్లాండ్స్‌లోని లీవార్డెన్‌లో ఆంట్జే వాన్ డెర్ ములెన్, ఆమె భర్త ఆడమ్ జెల్లె దంపతులకు మాత హరి జన్మించింది. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. మాతా హరి పాక్షికంగా యూదు, మలేషియన్ లేదా జావానీస్, అంటే ఇండోనేషియా సంతతికి చెందినవారని సాంప్రదాయ వాదనలు ఉన్నప్పటికీ, ఆమెకు యూదు లేదా ఆసియా వంశపారంపర్యత లేదని ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డచ్ అని పండితులు తేల్చారు. ఆమె మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి గూఢచారిగా దోషిగా నిర్ధారించబడింది. ఫ్రెంచ్ సైన్యం కదలికలకు, జాతీయ భద్రత విషయాలు జర్మనీకి లీక్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఫ్రెంచ్ ఆర్మీ ఆఫీసర్లను లోబరుచుకొని మిలటరీ సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసిందట. మాతా హరిని ఫ్రాన్స్‌లో ఫైరింగ్ స్క్వాడ్ ఉరితీసింది. ఫ్రెంచ్ సైన్యానికి బలిపశువు అవసరం కాబట్టి ఆమెను దోషిగా నిర్ధారించారని కూడా కొంతమంది అప్పుడు వాదించారు.
Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!
Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
Mata Hari | India Pakistan spy | India spy arrest | woman arrested for spying | YouTuber spy news | Facts in Jyoti Malhotra case | jyoti malhotra | latest-telugu-news