Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడ్డ జనం..పీవోకేలో నిరసనలు

పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

New Update
POK

పాక్ ఆక్రమిత కాశ్మీర్...ఇక్కడ ప్రజలు ఇప్పుడు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ దోచుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. ద్రవ్యోల్బణం, ఉపాధి తమ ప్రంతంలోని వనరుల్ని పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని పీవోకే ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై అక్కడి ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. పాక్ సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. వేలాది సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనలు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతోంది. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు.  

ప్రజలపై ఆర్మీ, పోలీసులు కాల్పులు..

పీవోకే లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతికేంగా పోరాడ్డం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా రావల్ కోట్ లో పాక్ ఆర్మీపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ లు అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీవోకేలో ప్రజలు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచేందుకు ఆర్మీ, పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.  దాంతో పాటూ ఆర్మీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు కూడా జరిపింది. మరోవైపు కోట్లీలో కూడా పాక్ సైన్యం కాల్పులు జరిపింది.  ఈ ఘటనల్లో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మరణించారు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం, పర్యాటకుల్ని పీఓకే వెళ్లవద్దని సూచించింది. జర్నలిస్టులు, మీడియా పీఓకేలోకి ప్రవేశించకుండా నిషేధించింది. పీఓకేలో 2000 మంది పోలీస్ సిబ్బంది, 167 ఎఫ్సీ ఫ్లాటూన్లను మోహరించినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు