/rtv/media/media_files/2026/01/07/maduro-2026-01-07-19-30-41.jpg)
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో(Nicolás Maduro) గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఆయన మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది సుమారుగా 2012-13 తర్వాత జరిగింది. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం దేశాన్ని నిలబెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. దాని కోసం బంగారం విక్రయాలు కూడా తలపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో దాదాపు మూడేళ్ల పాటూ అంటే 2013 నుంచి 2016 వరకు అధ్యక్షుడు మదురో వెనెజువెలా సెంట్రల్ బ్యాంక్ నుంచి 113 మెట్రిక్ టన్నుల విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది. దీని విలువ భారత కరెన్సీలో రూ.46 వేల కోట్లు ఉంటుంది. వెనిజులా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న నిల్వల నుంచే ఈ బంగారం తరలిపోయినట్లు స్విస్ బ్రాడ్‌కాస్టర్ 'ఎస్‌ఆర్‌ఎఫ్' ధ్రువీకరించింది. అయితే ఈ బంగారం అంతా దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, డబ్బులు లభ్యత కోసం ప్రభుత్వం అమ్మిందని తెలుస్తోంది. ప్రపంచంలోనే గోల్డ్ రిఫైనింగ్‌కు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రం కావడంతో.. అక్కడ శుద్ధి చేయడం, ధ్రువీకరణ పొందడం కోసం ఈ బంగారాన్ని పంపినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇదంతా మదురో తన కోసం దాచి పెట్టుకున్నారనే వాదనలూ ఉన్నాయి.
Also Read : గ్రీన్ ల్యాండ్ స్వయంగా లొంగిపోతుందా? ట్రంప్ ఆపరేషన్ అవసరం ఉండదా? ఏం జరగబోతోంది?
మదురోకు స్విస్ అకౌంట్లు..
అలాగే 2017 తర్వాత ఈ బంగారం ఎగుమలుతు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. యూరోపియన్ యూనియన్ వెనెజువెలాపై ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో వెనిజులాకు చెందిన కీలక వ్యక్తులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. స్విట్జర్లాండ్ కూడా 2018 తర్వాత లో ఈ ఆంక్షలను ఎదుర్కొంది. దాంతో పాటూ వెనెజువెలా సెంట్రల్ బ్యాంక్ దగ్గర బంగారం నిల్వలు కూడా నిండుకుని ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే...మదురో అరెస్ట్ తర్వాత ఆయనతో పాటూ ఆయనకు అత్యంత సన్నిహితులైన మరో 36 మందికి సంబంధించిన ఆస్తులను స్విస్ బ్యాంకులు స్తంభింపజేశాయి. వాటి మొత్తం విలువ ఎంత ఉంటుందనే ఇంకా తెలియలేదు. ఈ ఆస్తులకు, ఆ దేశ సెంట్రల్ బ్యాంకు నుంచి బదిలీ అయిన బంగారానికి ఏమైనా సంబంధాలున్నాయా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.
Also Read : వెనెజువెలా అయిపోయింది.. మరో దేశంపై దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్
Follow Us