ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ ఇరాన్‌ను టార్గెట్ చేశారు. అక్కడ అంతర్యుద్ధం జరిగేలా బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసేందుకు ప్లాన్ వేసినట్లు సమచారం. ఏ క్షణమైన అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో కలిసి ఈ దాడికి ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడమే టార్గెట్.. అవసరమైతే మిలటరీని దింపుతాం: ట్రంప్
ఈ సమయం కోసమే అమెరికా దళాలు ఎదురుచూస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ప్లాన్‌ను ఖమేనీ ముందే పసిగట్టారని ఇందుకోసం ఆయన రష్యా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అత్యంత సురక్షిత బంకర్ ఖమేనీ ఉంటున్నారు. మరోవైపు ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనడం, కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపై నిరసనలు చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఈ అల్లర్లలో 30 మంది మృతి చెందారు.
Also Read: అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా
Follow Us