Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఆవేదన

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో  వచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్ ని ఆకట్టులేకపోయినట్లు తెలుస్తోంది. కథ.. కథనం అన్నీ ఔట్ డేటెడ్..  ఓవరాల్ గా గేమ్ చేంజర్ ఒక  ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు నెటిజన్లు.

New Update

హీరో ఇంట్రో, ఇంటర్వెల్ బ్యాంగ్, అప్పన్న ఫ్ల్యాష్ బ్యాక్, సాంగ్స్ ఇలా ముక్కలుముక్కలుగా చూస్తే గేమ్ ఛేంజర్ ఒకే అనిపిస్తుంది. కానీ ఓవర్ ఆల్ మాత్రం కాస్త డిసప్పాయింట్ చేసినట్లు చెబుతున్నారు. ఎస్. జే సూర్య,  రామ్ చరణ్ మధ్య సీన్స్ బాగా వర్క్ అవుట్ అయినట్లు అంటున్నారు. 

గేమ్ చేంజర్ కథ.. కథనం అన్నీ ఔట్ డేటెడ్..  ఓవరాల్ గా గేమ్ చేంజర్ ఒక  ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు నెటిజన్లు. 

మరో నెటిజన్ ఇలా అన్నాడు.. ఇప్పటికే  ఇండియన్ 2 సినిమా చూసి.. గేమ్ ఛేంజర్ చూడొద్దని అనుకున్నాను. కానీ వెళ్ళాను. స్టోరీ నిల్.. అసలు లింక్ లేని లవ్ ట్రాక్.. సినిమాలో హైలైట్ రామ్ చరణ్ నటన ఒక్కటే

కర్ణాటకలో గేమ్ ఛేంజర్ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంటోంది. సినిమా ఊహించిన స్థాయిలో లేదని నెటిజన్లు అంటున్నారు. 

రూ. 500 కోట్ల సినిమా అన్నారు? అసలు రూ. 50 కోట్ల విలువైన సీన్ ఒక్కటైనా ఉందా? సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ లేదు. ఆ పాటలు ఎందుకు అని పోస్ట్ పెట్టాడు ఓ నెటిజన్. 

రాజమౌళి తో సినిమా చేశాక ఫ్లాప్ నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ అని మరొకరు పోస్ట్ పెట్టారు. 

Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు