/rtv/media/media_files/2025/06/14/9rFM3LvgI6s7yclpdpBc.jpg)
Israel's defence minister warns Iran that 'Tehran will burn' if it continues firing missiles
Israel:
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైకి ప్రతిదాడులు చేస్తోంది. ముందుగా భారీ సంఖ్యలో డ్రోన్లను టెల్ అవీవ్‌పైకి టెహ్రాన్ ప్రయోగించింది. ఆ తర్వాత వందల సంఖ్యలో క్షిపణులను పంపించింది. దీంతో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
జనావాసాలపై దాడులు చేసి.. వాళ్లకి హాని తలపెట్టాలని చూస్తే ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన చర్యలతో దేశ ప్రజలను ప్రమాదంలోకి పడేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై తిరిగి దాడులు చేసేందుకు తమ దేశ వైమానిక దళం సిద్ధంగా ఉందని IDF చెప్పింది. ఈ మేరకు ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక టెల్‌అవీవ్‌పై ఇరాన్ చేస్తున్న దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు.
Also Read: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం ఏంటి..ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి?
మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్‌కు సహకరించే దేశాలను ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలు ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఆయా దేశాల నౌకలను, స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడులు చేస్తున్న టెల్ అవీవ్‌కు అమెరికా సాయం చేస్తోందని ఇప్పటికే ఇరాన్ అధికారులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అమెరికా ఖండించింది. ఇవి తప్పుడు ప్రచారాలని కొట్టిపారేసింది.
Also Read: మూడు రోజుల ముందే ప్లాన్ లీక్.. ప్లైట్ క్రాష్ కుట్ర పన్నిన ఆల్‌ఖైదా..?
Also Read: రెండుసార్లు టికెట్ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..
Follow Us