/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/israel-jpg.webp)
Gaza
ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. కేవలం 24 గంటలు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 85 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మంది పాలస్తీనీయులు మరణించారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించేందుకే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..
Israeli strikes kill at least 85 in Gaza as Israel allows more aid into Palestinian territory https://t.co/9Px7wed8Cl
— New York Daily News (@NYDailyNews) May 21, 2025
ఇది కూడా చూడండి: Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
48 గంటల్లో 14 వేల మంది..
ఇదిలా ఉండగా ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా గాజా పసిపిల్లలపై ఆందోళన వ్యక్తం చేసింది. మరో 48 గంటల్లో వారికి ఆహారం అందకపోతే 14 వేలమంది పసివాళ్లు మరణించే అవకాశం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. గడచిన11 వారాలుగా ఇజ్రాయెల్ నిర్భంధంలో ఉన్న పాలస్తీనా భూభాగంలోకి పరిమిత సహాయాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో పిల్లలకు ఆహారం అందడం లేదు.ఇదే విషయమై యూఎన్ హ్యూమానిటేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ.. సోమవారం నాడు కేవలం ఐదు ట్రక్కులు సహాయ సామాగ్రి, శిశువుల కోసం ఆహారంతో సహా గాజాలోకి ప్రవేశించాయి.
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’
కానీ.. అది చాలా చిన్నమొత్తమని, అక్కడ అవసరమైన సమాజాలకు ఆహరం చేరడం లేదని ఆయన వెల్లడించారు.మేము వారికి సహాయం చేయకపోతే పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులు వారి పిల్లలకు ఆహారం ఇవ్వలేరు. అలా జరిగితే రాబోయే 48 గంటల్లో 14,000 శిశువులు మరణిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి:TG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్...! ఉరేసుకుని భార్య...