/rtv/media/media_files/2025/08/03/revanna-1-2025-08-03-18-04-43.jpg)
తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో JDS మాజీ ఎంపీ ప్రజ్వేల్ రేవణ్ణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చుతూ అతనికి జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ.11లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. అందులో రూ. 11.25 లక్షలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అక్కడ ఆయన జీవిత ఖైదీగా తన జీవితాన్ని ప్రారంభించారు. 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణకు 15528 నంబర్ దోషిగా కేటాయించి జైలులోని దోషుల బ్యారక్‌కు తరలించారు. అతని తెల్లని యూనిఫాం ఇచ్చారు.
With Prajwal Revanna in jail, there is a growing demand for harsh punishment for those who distributed the pen drive linked to the case.
— The Federal (@TheFederal_News) August 3, 2025
Read more: https://t.co/yZYcK815pn#PrajwalRevanna#Bengaluru#JDS#WomenSafety#Karnatakapic.twitter.com/5DGnzprG0r
శిక్ష పడిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ తన తొలి రాత్రి జైలులో గడిపారు. ఈ సమయంలో ఆయన చాలా బాధపడి, కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. ఇతర ఖైదీల లాగే ప్రజ్వల్ రేవణ్ణ ప్రతిరోజూ ఎనిమిది గంటల పనిచేయాల్సి ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం ఆయనకు బేకరీ, గార్డెనింగ్, వ్యవసాయం వంటి పనులలో ఏదో ఒకటి కేటాయిస్తారు. ఈ పనులకు గాను ఆయనకు నెలకు రూ.524 జీతం లభిస్తుంది. కాగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ ప్రజ్వల్ రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించారు. తనను నిర్దోషిగా ప్రకటించాలని ఆయన కోరారు. కేసు విచారణలో భాగంగా, రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన కోర్టులో వాదించారు. మొత్తం ప్రజ్వల్ రేవణ్ణపై నాలుగు వేర్వేరు కేసులు ఉన్నప్పటికీ, ఇది మొదటి కేసులో వచ్చిన తీర్పు మాత్రమే. మిగిలిన మూడు కేసులలో కూడా విచారణ జరుగుతోంది.
ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే కంటతడి
కర్ణాటకలోని హసన్ జిల్లాలోని గన్నికాడ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి చేసినట్లుగా ముందుకు పోలీసులకు ఫిర్యాదు అందింది. 2021 నుంచి రేవణ్ణ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులకు కంప్లైట్ ఇచ్చింది. ఆ దారుణాన్ని వీడియోలు కూడా తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. గతేడాది మే 31న ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. 123 ఆధారాలు, 2 వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. 23 మంది సాక్ష్యులను విచారించిన కోర్టు.. 14 నెలల తర్వాత రేవణ్ణను దోషిగా తేల్చింది. ఈ తీర్పుతో ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే కంటతడి పెట్టుకున్నారు. తనకు తక్కువ శిక్ష వేయాలని ఏడుస్తూ జడ్జిని వేడుకున్నారు. రాజకీయంగా త్వరగా ఎదగడమే తాను చేసిన తప్పంటూ ఆవేదన వ్యక్తం చేశారు.