Israel: దెబ్బ తిన్న ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ

ఇజ్రాయెల్‌ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్‌ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే  కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్‌సెప్టర్లు ఇజ్రాయెల్‌ వద్ద లేవు.

New Update
israel

Netanyahu-Khameni

యుద్ధంలో ఇరాన్‌పై తమదే పైచేయి అవుతోందని, ఇరాన్‌ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్‌ పదేపదే చెప్పుకుంటోంది. కానీ, యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన ఆయుధ సంపత్తి రోజురోజుకీ తరిగిపోతుండడం ఆదేశానికి నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్‌రేంజ్‌ మిస్సైల్‌ ఇంటర్‌సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది.

Also Read: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. మళ్లీ వీసాలు షురూ

Israeli Air Defense System Hit

ఇజ్రాయెల్‌ వద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తగినంతగా లేదని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ సైన్యం శుక్రవారం ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించింది. గత 6 రోజులుగా ఇరుదేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్‌పై దాదాపు 400 బాలిస్టిక్‌ మిస్సైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలావరకు ఇజ్రాయెల్‌ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. 

Also Read :  ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పుతిన్‌కు కౌంటర్ ఇచ్చిన ట్రంప్

అమెరికా నుంచి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్‌పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్‌ రక్షణ రంగ నిపుణులు తేల్చిచెబు తున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్‌ మరో 10 నుంచి 12 రోజు ల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: భారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతి

ఇజ్రాయెల్‌ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్‌ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే  కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్‌సెప్టర్లు ఇజ్రాయెల్‌ వద్ద లేవు.

Also Read: యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన ప్రకటన

 

latest-telugu-news | iran israel war | iran israel war news | Drone Attack On Israeli PM | iron dome | Israeli army | iran israel tensions | israeli air strike on iran | israeli air forces strikes on iran

Advertisment
Advertisment
తాజా కథనాలు