Israel: గాజాపై ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులు.. ఆరుగురు మృతి

గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. శనివారం మళ్లీ వైమానికి దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్‌ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
Israel Launches Fresh Strikes On Gaza After Donald Trump’s Truce Call, Six Dead

Israel Launches Fresh Strikes On Gaza After Donald Trump’s Truce Call, Six Dead

గాజాపై ఇజ్రాయెల్(israel gaza war) మళ్లీ విరుచుకుపడింది. శనివారం మళ్లీ వైమానికి దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్‌ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు ఆఖరికి హమాస్(hamas) కూడా బందీలందరినీ విడిపిస్తామని చెప్పింది. అలాగే ట్రంప్‌ ప్రతిపాదించిన ఒప్పందంలో పలు షరతులకు కూడా అంగీకరించింది. అయినప్పటికీ ఇజ్రాయెల్‌.. గాజాపై మళ్లీ బాంబు దాడులు చేయడం కలకలం రేపుతోంది.  

శనివారం ఉదయం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ బందీలందరిని విడిపించే ట్రంప్‌ మొదటి దశ ప్లాన్‌ను అత్యవసరంగా అమలు చేసేందుకు సన్నద్ధమవుతోందని పేర్కొంది. ఆ తర్వాత గాజాలో మిలిటరీ చర్యలు తగ్గించాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు వెళ్లినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ట్రంప్ ప్లాన్ ప్రకారం యుద్ధాన్ని ఆపేందుకు తాము సహకరిస్తామని కూడా నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.  

Also Read :  Nirav Modi: నీరవ్‌ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్‌కు అప్పగింత

Israel Launches Fresh Strikes On Gaza

అయితే గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాను తీసుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించగా.. హమాస్‌కు ఆదివారం వరకు గడువు విధించారు. ఒప్పందానికి ఒప్పుకోకపోతే నరకం చూపిస్తానని హెచ్చరించారు. దీంతో హమాస్‌ బందీలందరినీ విడిపించేందుకు అంగీకరించింది. ఒప్పందంలో భాగంగా చూసుకుంటే హమాస్‌ 72 గంటల్లో బందీలందరినీ విడుదల చేయాలి. అలాగే ఇజ్రాయెల్ 250 మంది ఖైదీలను విడుదల చేయాలి. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేయడం గమనార్హం. 

Also Read :  వెనుజులాపై అమెరికా యుద్ధం.. ఆ చాకుతో షిప్ పేల్చేసిన ట్రంప్!

Advertisment
తాజా కథనాలు