Met Gala: మెట్ గాలాలో షారూక్ మెరుపులు..మొదటిసారి

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మొదటిసారి మెట్ గాలాలో సందడి చేశారు. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్, మెడలో కె లెటర్ ఉన్న చైన్ తో మెరుపులు మెరిపించారు.  చేతిలో స్టిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

New Update
met gala

Shah Rukh Khan, Met Gala

అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతున్న అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025లో ఇండియన్ సెలబ్రెటీలు మెరిశారు. అక్కడి మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈసారి వేడుకల్లో ఇండియా నుంచి షారూక్ ఖాన్, కియారా అద్వానీ, దిల్జిత్, ప్రియాంక చోప్రా సందడి చేశారు. ఈ ఈవెంట్ లో మొదటిసారిగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మెరుపులు మెరిపించారు. 

Also Read :  మొబైల్స్ వాడుతున్నారా? ఇకమీదట వారికి అనుమతి లేదు..

బ్లాక్ డ్రెస్ లో...

స్టైల్ కు మారుపేరు షారూక్ ఖాన్. ఈ హీరోకు మొట్టమొదటిసారిగా మెట్ గాలాలో మెరిసే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఇండియా నుంచి హీరోయిన్లు మాత్రమే మెట్ గాలాలో సందడి చేశారు. తొలిసారిగా ఒక హీరో అది కూడా షారూక్ ఖాన్ సందడి చేశారు. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి రూపొందించిన బ్లాక్ డ్రెస్, మెడలో కె లెటర్ ఉన్న చైన్ తో షారూక్ ర్యాంప్ వాక్ చేశారు. షారూక్ చేతిలో కర్ర అన్నింటి కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డ్రెస్ లో  బాలీవుడ్ కింగ్ ఖాన్ తన సిగ్నేచర్ స్టైల్ లో ఫోటోలకు పోజులిచ్చారు. 

Also Read :  హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు..!

75 వేల డాటర్లు కట్టాలి..

మెట్‌ గాలాకు సెలబ్రిటీలు ఆహ్వానం అయితే వస్తుంది కానీ...అందులో పాల్గొనాలంటే వారు 75 వేల డాటర్లు చెల్లించాల్సిందే.  2023 వరకూ ఈ మొత్తం 50 వేల డాలర్లు మాత్రమే ఉండేది. ఆ తరువాత దాని ఫీజును పెంచేశారు. ఇక్కడ ప్రతీ సీట్ కు ఒక ధర ఉంటుంది. ఫీజు చెల్లించాక..నిర్వాహకులే షీట్ ను కూడా నిర్ణయిస్తారు. ఈ ఈవెంట్ లో అంతా నిర్వాహకుల ఇష్టమే. ఈ జాబితాను డిసెంబర్‌లోనే సిద్ధం చేస్తారు. డ్రెస్ ల విషయంలోనూ ఇదే తరహా నియమం పాటించాలి. మనం దుస్తులను ముందే నిర్వాహకులకు చూపించి.. వారు అంగీకారం చెప్పాకనే వాటి షో చేయాల్సి ఉంటుంది. 

Also Read :  ఉచితాలు తగ్గించాలి.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్

 

Also Read :  అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం.. కన్న కొడుకుని అమ్మేసింది!

 today-latest-news-in-telugu | shah-rukh-khan | metgala-fasion-show-2024 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు