Russia-Ukraine War: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. జెలెన్స్కీ సంచలన ప్రకటన

ఆదివారం రష్యాపై ఉక్రెయిన్‌ వివిధ ప్రాంతాల్లో 117 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇర్క్‌ట్స్క్‌ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దాదాపు ఏడాదిన్నర పాటుగా ఈ దాడుల కోసం ప్రణాళిక రచించినట్లు జెలెన్స్కీ తెలిపారు.

New Update
Russia Ukraine War

Russia Ukraine War

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఇరుదేశాలు ఒకదానిపై మరోకటి కాల్పులు జరుపుకుంటున్నాయి. తాజాగా ఆదివారం రష్యాపై ఉక్రెయిన్‌ భీకర దాడులు చేసింది. ఏకంగా 117 డ్రోన్లతో వైమానిక స్థావరాలపై  విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీయే వెల్లడించారు. ఇదొక అద్భుతమైన ఆపరేషన్‌ అని.. దాదాపు ఏడాదిన్నర పాటుగా ఈ దాడుల కోసం ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో దీని గురించి వీడియో విడుదల చేశారు. 

Also Read: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వైమానిక దాడుల కోసం ఉక్రెయిన్‌.. రష్యాకు కంటెయినర్లలో డ్రోన్లను తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4 వేల కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని పోయి మరీ దాడులు చేయగలిగింది. మధ్యాహ్నం పూట ఇర్క్‌ట్స్క్‌ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి.  అయితే ఇక్కడ ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే మొదటిసారి. ర్యాజన్, ముర్మన్స్క్‌ ప్రాంతాల్లో కూడా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసినట్లు రష్యా అధికారులు చెప్పారు.

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

అలాగే ఒలెన్యా, బెలయాతో పాటు నాలుగు మిలిటరీ ఎయిర్‌బేస్‌లపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో టీయూ-22ఎం3 బాంబర్లు,  టీయూ-95, కీలకమైన ఏ-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ తమపై చేసిన దాడులను రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఉగ్రదాడులుగా అభివర్ణించింది. ఇర్క్‌ట్స్క్‌, ఇవానోవా, ర్యాజన్, అముర్‌, ముర్మన్స్క్ ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ అన్ని దాడులను తిప్పికొట్టామని.. వైమానిక స్థావరాలకు దగ్గరి నుంచి ఎఫ్‌పీవీ డ్రోన్లతో దాడులు చేయడంతో వైమానిక సామాగ్రి మంటల్లో చిక్కుకుందని తెలిపింది. అలాగే రష్యాలోకి డ్రోన్లు తరలించిన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విరుచుకుపడ్డ రష్యా

ఉక్రెయిన్‌ దాడి తర్వాత.. రష్యా కూడా రంగంలోకి దిగింది. ఉక్రెయిన్‌ సైనిక శిక్షణ కేంద్రంపై దాడులు చేసింది. మొత్తం 472 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడులు రష్యా,ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి. రష్యాలో 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా.. ఉక్రెయిన్‌కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. 

Also Read: అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతి

russia-ukraine-war | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు