/rtv/media/media_files/2026/02/28/israel-attacks-iran-2026-02-28-13-05-32.jpg)
Israel attacks Iran, US official says US took part in strikes
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. శనివారం ఉదయం టెహ్రాన్‌లోని భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భయంకర వాతావరణం నెలకొంది. ఈ దాడులు తామే చేశామని ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా పాల్గొంది. ఇరాన్‌పై జరిగిన దాడిలో అమెరికా కూడా పాల్గొన్నట్లు ఓ అమెరికన్ అధికారి వెల్లడించారు.
BREAKING: 🚨 ISRAEL LAUNCHES TERRORIST ATTACK ON IRAN
— ADAM (@AdameMedia) February 28, 2026
The terrorist state of Israel has launched an illegal and unprovoked bombing campaign against Iran, plunging the region into chaos.
THIS IS TERRORISM.
pic.twitter.com/YxFtesv2sw
Also Read: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్
Israel-Iran War
ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం పౌరులను అప్రమత్తం చేసింది. అక్కడ కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్‌లోని స్కూళ్లు, కార్యాలయాలను మూసివేశారు. దీంతో టెల్ అవీవ్ సైరన్లు మోగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని వారాల్లోనే మళ్లీ ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.
Israel declares that the attack on Iran was a joint strike with the United States. The US is now at war with Iran as well. pic.twitter.com/wY1bPFm0h2
— Anonymous (@YourAnonCentral) February 28, 2026
Also Read: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?
మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇరాన్ రాజీ పడకుండా తాము దాడులు చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్‌కు సమీపంలో యుద్ధ నౌకలను కూడా పంపించారు. ఏ క్షణమైన అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేయొచ్చనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఇజ్రాయెల్ నుంచి ఇరాన్‌పై దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
🇮🇱🇺🇸🇮🇷 Israel Launches Strikes on Iran!!
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) February 28, 2026
Iranian President Masoud Pezeshkian also reportedly targeted by Israeli airstrikes. pic.twitter.com/jLdN2DMlMC
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల(iran israel war) నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకు బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది.దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.మళ్లీ ఇప్పుడు ఇరాన్ కూడా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది.
ఇటీవల ట్రంప్ ఇరాన్‌పై దాడులు చేసేందుకు బ్రిటన్ సాయం కోరిన సంగతి తెలిసిందే. అక్కడి ఎయిర్‌బేస్‌లు కావాలని అభ్యర్థించారు. కానీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇందుకు ఒప్పుకోలేదు. అందుకే అమెరికా ఇజ్రాయెల్ సాయంతోనే నేరుగా ఇరాన్‌పై ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Follow Us