/rtv/media/media_files/2026/02/28/menaka-guruswamy-2026-02-28-09-59-38.jpg)
Menaka Guruswamy, TMC's pick for Rajya Sabha, could become India's first LGBTQ MP
త్వరలో రాజ్యసభ ఎన్నికలు(rajyasabha-elections) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్(west bengal) లోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మంత్రి బాబుల్ సుప్రియో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి(Menaka Guruswamy), బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, నటి కోయల్ మల్లిక్ ఉన్నారు. ఈ నలుగురిలో సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి రికార్డు సృష్టించనున్నారు. ఒకవేళ ఆమె ఎగువసభకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు. మార్చి 16న దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలను ఎన్నికలు నిర్వహించనున్నారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం అయిదు స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. వీటిలో నాలుగు టీఎంసీ, ఒకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.
Also read: అగ్నివీర్లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు
మేనకా గురుస్వామి ఎవరు ?
మేనకా గురస్వామి న్యాయవాది వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. LGBTQ ఎంపీగా ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టడం భారత్‌లో సమానత్వానికి మైలురాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. 2018లో మేనకా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. LGBTQ బంధాలను నేరంగా చెప్పే IPC సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించారు. 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీన్‌ను మొదలుపెట్టింది. 2001లో ఆక్స్‌ఫర్డ్‌లో బీసీఎస్, హార్వర్డ్‌లో LLM పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆమె న్యూయార్క్‌లోని డేవిస్ పోల్క్, వార్డ్‌వెల్‌లో అసోసియేట్‌గా పనిచేసింది. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి న్యూఢిల్లీలో సెటిల్ అయ్యారు.
Also Read: తమిళ రాజకీయాల్లో 'చిన్నమ్మ' సంచలనం.. శశికళ కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరణ
2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్లో ఆమెకు చోటుదక్కింది. 100 మంది ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్స్ లిస్ట్‌లో ఆమె పేరు కూడా వచ్చింది. అలాగే అదే ఏడాది టైమ్ మ్యాగజైన్లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్టులో కూడా ఆమె చోటు సంపాదించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల IPAC కార్యాలయంలో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేసిన మేనకా కోర్టులో టీఎంసీ పార్టీ తరఫున వాదనలు వినిపించారు. అందుకే ఆమెకు రాజ్యసభ స్థానానికి అవకాశం కల్పించినట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవేళ మేనకా రాజ్యసభకు ఎన్నికైతే దేశంలో తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.
LGBTQ అంటే ఏమిటి?
LGBTQ అనేది విభిన్న లైంగిక ధోరణులు, లింగ గుర్తింపులను సూచించే పదం
L (Lesbian): ఒక మహిళ మరో మహిళపై ఆకర్షణ చూపుతుంది
G (Gay): పురుషులు పురుషుల పట్ల ఆకర్షణ చూపుతారు
B (Bisexual): పురుషులు, మహిళలు ఇద్దరి పట్ల ఆకర్షితులవుతారు
T (Transgender): పుట్టినప్పుడు కేటాయించిన లింగం కంటే భిన్నమైన లింగ గుర్తింపు కలిగి ఉంటారు
Q (Queer/Questioning): వీళ్లు సంప్రదాయ లింగ విభజనలకు భిన్నంగా ఉంటారు. వీళ్లు తమను తాము పూర్తిగా పురుషుడిగానో లేదా పూర్తిగా స్త్రీగానో గుర్తించుకోరు.
ఇక మేనకా గురుస్వామిని ఉదాహరణగా తీసుకుంటే, ఆమె తనను తాను క్వీర్ (Queer) గా గుర్తించుకున్నారు.
Follow Us