ఆ అరెస్టు వారెంటు రద్దు చేయాలి.. ఐసీసీని కోరిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్‌ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
NETHANYAHU

ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్‌ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో అరెస్టు వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే వీళ్ల అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు.. నెతన్యాహు, యోవ్ గల్లాంట్‌పై జారీ చేసిన అరెస్టు వారెంట్లను సవాలు చేసినట్లు పేర్కొంది. 

Also Read: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్

మా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరిస్తే.. ఐసీసీ మాకు వ్యతిరేకంగా, పక్షపాతంగా ఉందనేది అమెరికాతో పాటు తమ మిత్రదేశాలకు తెలుస్తోందని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గాజాలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నెతన్యాహుతో పాటు గల్లాంట్.. గాజాలో హత్యలు, హింస, ఆకలి చావులు వంటి యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఐసీసీ ఆరోపణలు చేసింది. దీని ఫలితంగా మానవ సంక్షోభం తీవ్రతరం అయ్యి మరణాలకు దారితీసిందని పేర్కొంది.  

Also Read: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?

అక్కడ ఎంతోమంది చిన్నారులు బాధితులుగా మారారని, అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేందుకు అన్ని ఆధారాలు గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వాళ్లపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. మరోవైపు ఈ అరెస్టు వారెంట్‌ను నెతన్యాహు ఖండించారు. ఇవి తప్పుడు చర్యలని తెలిపారు. తమపై వేసిన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరారు. ఇదిలాఉండగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య యుద్ధం ఆగింది. 14 నెలల పాటు కొనసాగిన ఈ పోరాటానికి ఇరుపక్షాలు 60 రోజులకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి .

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

Also Read: పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు