TS: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్ గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టింది. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణించారని కేటీఆర్ ఆరోపించారు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ వేస్తున్నామని తెలిపారు. By Manogna alamuru 27 Nov 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈనెల 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థల తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను కాలేజీలను పరిశీలిస్తారన్నారు. ఈ గురుకుల బాట కార్యక్రమానికి ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులకు సహకారం అందించాలని కేటీఆర్ సూచించారు. బాలికల విద్యాసంస్థల్లో పార్టీ తరఫున విద్యార్థి విభాగం మహిళా నాయకులు, పార్టీ మహిళా నాయకులు సందర్శిస్తారని కేటీఆర్ తెలిపారు. జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మహిళా సీనియర్ నాయకులు గురుకుల విద్యాసంస్థలను సందర్శించి బాలిక సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులు మరణించడం, విషాహారం కారణంగా విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్న ఘటనలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు చావులకు ఈ ముఖ్యమంత్రే కారణమవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్ర వ్యాప్తంగా 48 విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. విద్యాసంస్థల్లో ఉన్న దుర్భరమైన పరిస్థితులను తట్టుకోలేక 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని...8 మంది అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. నలుగురు విషాహారం తిని...మరో 13 మంది ఆనారోగ్యంతో చనిపోయారన్నారు. అంతేకాకుండా గత ఏడాది కాలంలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ.. గురుకుల విద్యాసంస్థల నిర్వహణలో అపారమైన అనుభవమున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా సభ్యులుగా డాక్టర్ ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారామ్ యాదవ్, వాసుదేవ రెడ్డి ఉంటారన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి విద్యా సంస్థల నిర్వహణ, అక్కడి సమస్యలపై సమగ్ర అవగాహన ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే గురుకుల బాటలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థలతో పాటు కస్తూర్బా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ కాలేజీలను సందర్శించనున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. కమిటీ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను సందర్శించి అక్కడి స్థితిగతులు, సౌకర్యాలను, పరిస్థితులను తెలుసుకోనుంది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఎదుర్కొంటోన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయనుంది. Also Read: J&K: కార్గిల్, సియాచిన్, గల్వాన్‌లో పర్యటించొచ్చు–ఆర్మీ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి