జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్ హాజరుకానున్నారు.

New Update
HEMANTH SOREN

Jarkhand: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య

81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్‌డీఏ 24 సీట్లు పొందాయి. ఈ ఎన్నికల్లో హేమంత్‌ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ సైతం విజయం సాధించారు. ఆదివారం నాడు హేమంత్‌ సోరెన్‌ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్‌ సంగ్మా, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, హిమాచల్‌ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో పాటు సీపీఎం జనరల్‌ సెక్రటరీ దీపాంకర్‌ భట్టాచార్య, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్‌ ఠాక్రే, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 

Also Read: Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం!

ఇక, కాబోయే 14 వ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనతో కలిసి మంగళవారం పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుల్లోని రామ్‌గఢ్‌ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రాకు వెళ్లిన సంగతి తెలిసిందే. హేమంత్‌ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్‌ ఈ గ్రామంలోనే జన్మించారు. శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్‌ను స్థానిక వడ్దీ వ్యాపారులు హత్య చేశారు. తాత సోబరెన్‌ సోరెన్‌ 67వ వర్ధంతిని పురస్కరించుకుని హేమంత్‌ ఆయనకు నివాళులర్పించారు. 

Also Read:  Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం!

ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు మాట్లాడారు. ఇక, గురువారం నుంచి రాష్ట్రంలో మన ప్రభుత్వం పని చేయబోతుందని హేమంత్‌  ప్రకటించారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా నా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్‌ సోరెన్ వారికి ఆహ్వానం పలికారు.

Also Read: AP : శుక్రవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు..ఇంకో 4 రోజులు

Advertisment
తాజా కథనాలు