/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pan-card-jpg.webp)
ప్రస్తుతం ఉన్న పాన్ కార్డ్, వాటికి అనుసరిస్తున్న విధానంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పన్ను చెల్లింపు సేవలను ఆధునిక టెక్నాలజీ సహాయంతో మరింత సులభతరం చేసేందుకు కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని కోసం కేంద్రం రూ. 1,435 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
పాన్ 2.0 ప్రత్యేకతలు..
పాన్ 2.0 ప్రాజెక్టులో ఇకపై ఇష్యూ చేయబోయే పాన్ కార్డులు ఎంబెడెడ్ క్యూఆర్ కోడ్తో వస్తాయి. ఇక మీదట అన్ని పాన్ కార్డ్ ఏవలు క్యూ కోడ్‌తో అనుసంధానించి జరుగుతాయి. దీని వలన మరింత వేగంగా, అత్యాధునిక టెక్నాలజీతో సేవలు పొందవచ్చును.
ప్రభుత్వం అందించే పలు సేవల్లో ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్ ద్వారా అప్లై చేసేందుకు, అర్హత పొందేందుకు, లబ్ది పొందేందుకు ఈ పాన్ కార్డు 2.0 ఉపయోగపడుతుంది.
కొత్త పాన్ కార్డులు ఎకో ఫ్రెండ్లీ, సెక్యూర్డ్‌గా ఉండనున్నాయి.
Also Read: Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం!
పాన్ కార్డ్ 2.0 వల్ల లాభాలు..
ట్యాక్స్పేయర్ రిజిస్ట్రేషన్ సేవలు త్వరితగతిన, యూజర్ ఫ్రెండ్లీగా పొందొచ్చు.
ప్రస్తుతం ఉన్న పాత పాన్ కార్డులను మార్చుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. యూజర్లు ఈజీగా పాన్ 2. కు అప్‌గ్రే అవ్వొచ్చును. దీని కోసం కొత్త పాన్ కార్డుకు అప్లై చేయాల్సిన అవసరం లేదు.
ఇది ప్రక్రియలను పేపర్‌లెస్‌గా, సురక్షితంగా, సమర్థవంతంగా చేస్తుంది. మొత్తానికి భారతదేశాన్ని డిజిటల్‌గా శక్తివంతం చేయనుంది.
కొత్త పాన్ 2.0 తో పాన్, టాన్ సేవలను సమీకృత వ్యవస్థ కింద ఏకీకృతం చేస్తుంది. ఈ అప్డేట్ వాణిజ్య రంగానికి చాలా కాలంగా డిమాండ్ ఉంది.
Also Read: Movies: సెన్సార్ ఓకే..ఇక తగ్గేదే ల్యా..పుష్ప–2