/rtv/media/media_files/2025/09/08/trump-2025-09-08-14-40-13.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చాలామందిని దేశం నుంచి పంపించేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే H1బీ , ఎఫ్ 1 వీసాదారుల అనధికారిక సంపాదనపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు అందించడం ప్రారంభించినట్లు తెలిసింది. దీనివల్ల సైడ్ ఇన్‌కమ్‌పై ఆధారపడే చాలామందికి అమెరికా బహిష్కరణ ముప్పు ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: మూడో భార్య చేతిలో భర్త బలి.. కాళ్లు చేతులు కట్టి, చీరతో చుట్టి - ట్విస్టులే ట్విస్టులు..!
పోర్టులు, రాయబార కార్యాలయాల వద్ద ప్రవేశించే సమయంలో హెచ్1బీ వీసాదారులను ఇమిగ్రేషన్ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో వాళ్లు విద్యార్థులుగా ఉన్నప్పుడు అనధికారికంగా పనిచేసినటువంటి పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కొన్నిసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పడు కూడా వారి బ్యాక్‌గ్రౌండ్ మొత్తాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏళ్లక్రితం అనధికారికంగా చేసిన పార్ట్‌టైమ్ జాబ్‌ల సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం IRS ద్వారా పన్ను రికార్డులు పరిశీలించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
Also Read: వినాయక చవితికి దేశవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిందో తెలుసా?
ఇదిలాఉండగా వలసదారుల ఆర్థిక సమాచారాన్ని 'ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్' విభాగం అందిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా మీడియా వెల్లడించింది. దీనివల్ల పన్నులు చెల్లించిన, దాఖలు చేసిన ఆదాయం కంటే అనధికారికంగా సంపాదన గురించి ఎక్కువగా పరిశీలించే ఛాన్స్ ఉందని ఇమిగ్రేషన్ న్యాయ నిపుణులు అంటున్నారు. బహిష్కరణ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అనధికార ఉద్యోగాలు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు. అదనపు సాయం కోసం న్యాయవ్యవస్థల నుంచి సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు.
Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్