Wife Killed Husband: మూడో భార్య చేతిలో భర్త బలి.. కాళ్లు చేతులు కట్టి, చీరతో చుట్టి - ట్విస్టులే ట్విస్టులు..!

మధ్యప్రదేశ్‌లో వివాహేతర సంబంధం కారణంగా ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. అతని మూడో భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

New Update
Man killed by third wife in Madhya Pradesh

Man killed by third wife

సమాజంలో కొందరు రోజు రోజుకు అత్యంత క్రూరంగా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అక్రమ సంబంధాల వ్యవహారాలు సృతిమించిపోతున్నాయి. దీని కారణంగానే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రియుడి మోజులో పడి ఎంతో మంది మహిళలు తన భర్త, పిల్లలు, అత్త మామలను హతమారుస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘోరమైన సంఘటన జరిగింది. 

Man killed by third wife

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. అక్కడితో ఆగకుండా చనిపోయిన భర్త డెడ్ బాడీని తాళ్లతో కట్టి చీర, దుప్పటిలో చుట్టి బావిలో పడేశారు. కొన్ని రోజుల తర్వాత మృతుడి మాజీ భార్య బావిలో తేలుతున్న డెడ్ బాడీని గుర్తించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



భయాలాల్ రాజక్ అనే వ్యక్తికి మూడుసార్లు వివాహం జరిగింది. పలు కారణాలతో భయాలాల్ మొదటి భార్య అతన్ని విడిచిపెట్టింది. దీని తర్వాత అతడు గుడ్డి బాయి అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. అది కూడా విఫలమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదనే కారణంతో భయాలాల్ రెండవ భార్యను వదిలేశాడు. అనంతరం గుడ్డి బాయి చెల్లెలు మున్నీ అలియాస్ విమల రాజక్‌ను మూడో వివాహం చేసుకున్నాడు. 

భయాలాల్‌తో వివాహం తర్వాత మున్నీ ఒక ఆస్తి వ్యాపారి‌ అయిన లల్లు కుష్వాహాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడు తరచూ పూర్వీకుల భూమి ఒప్పందాల గురించి ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలోనే లల్లు కుష్వాహాతో ప్రేమలో పడిన మున్నీ.. ఎలాగైన అతడితో తన జీవితాన్ని పంచుకోవాలనుకుంది. అంతకంటే ముందు తన భర్తను వదిలించుకోవడానికి పథకం వేసింది. 

ఇందులో భాగంగానే ఆగస్టు 30న తన భర్త ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా.. మున్నీ ప్రియుడు లల్లు, అతని స్నేహితుడు ధీరజ్ భయాలాల్ తలపై ఇనుప రాడ్‌తో కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత కాళ్లు చేతులకు తాళ్లు గట్టిగా కట్టి ఆ డెడ్ బాడీని దుప్పటిలో చుట్టి, చీరలతో కట్టి ఒక సంచిలో పెట్టి అనుప్పూర్ జిల్లాలోని ఇంటి వెనుక పొలంలో ఉన్న బావిలో పడేశారు. కొన్ని రోజులకు ఆ మృతదేహాన్ని భయాలాల్ మాజీ భార్య కనుగొంది. బావిలో ఏదో తేలుతున్నట్లు ఆమె గమనించింది. అనంతరం అది తన మాజీ భర్త అని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి మొబైల్ ఫోన్‌తో పాటు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి మున్నీ, ఆమె ప్రియుడు లల్లూ, అతని స్నేహితుడు ధీరజ్‌ను అరెస్టు చేశారు.

Advertisment
తాజా కథనాలు