/rtv/media/media_files/2025/06/23/irans-ballistic-missile-sites-destroyed-2025-06-23-13-55-24.jpg)
Iran's ballistic missile sites destroyed
Iran Israel war : ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ (Israel Defense Forces) వివరించింది.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 15 యుద్ధ విమానాలు ఈ ఉదయం కెర్మాన్‌షా ప్రాంతంలో ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. కాగా బాలిస్టిక్ క్షిపణులన్నింటిని ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రయోగించేందుకు సిద్ధం చేయగా వాటిని నాశనం చేసినట్లు తెలిపింది. పలు బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలతో పాటు వాటి, ప్రయోగ కేంద్రాలను గుర్తించి విజయవంతంగా ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM
ఇక ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. ఖోరామాబాద్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసింది. దీన్ని ఇరాన్ మీడియా విరివిగా ప్రచారం చేయగా.. ఐడీఎఫ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అది హెర్మ్స్ రకం డ్రోన్ అని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇక అమెరికా దాడులను ఇరాన్ కొత్త సైనికాధ్యక్షుడు మేజర్ జనరల్ ఆమిర్ హతామీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధనేరాలకు పాల్పడతుందన్న ఆయన వారికి ప్రతిసారి గట్టి ప్రతిస్పందన ఎదురైందని వివరించారు. ఈసారి కూడా అంతకు మించి జవాబు ఉంటుందని హెచ్చరించారు.
Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన