/rtv/media/media_files/2025/06/12/pXo4uRMX7cvR41kIkxu7.jpg)
Iran Threatens US Bases Amid Rising Tensions Over Nuclear Deal
ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆరో రౌండ్ చర్చల కసోం ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇరాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకోవడంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు గాజాలో యుద్ధం ఆపాలని చెప్పినట్లు సమాచారం. వీళ్లిద్దరు సోమవారం ఫోన్‌కాల్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌పై దాడుల గురించి బయట మాట్లాడటం ఆపేయాలని.. అలాగే దాడులను ప్లాన్ పక్కన పెట్టాలని ట్రంప్ అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ అణుచర్చలు విఫలమైతే ఇజ్రాయెల్ దాడులు చేసే ఛాన్స్ ఉందని గత నెలలో ఓ వార్తా కథనం వెల్లడైంది. ట్రంప్ నుంచి దీనికి ఆమోదం వస్తుందని తెలిపింది.
Also Read: లాస్ ఏంజెలెస్ లోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ట్రంప్ కుర్చీకి ఇవి ఎసరు పెట్టనున్నాయా?
అయితే తాజాగా ఇరాన్ రక్షణ మంత్రి అజీత్ నసీర్‌జాదా స్పందించారు. ఒకవేళ చర్చలు విఫలమై మాపై దాడులు జరిగితే విదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్.. ఇరాక్‌లోని దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలు వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా.. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ చేసుకున్న సీక్రెట్ ప్లాన్‌ను లీక్ చేసిన మాజీ సీఐఏ విశ్లేషకుడు ఆసీఫ్ రహ్మన్‌కు అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి కోర్టు అతడికి 37 నెలల జైలు శిక్ష విధించింది. 2016 నుంచి CIAలో పనిచేస్తున్న రహ్మాన్.. 2024లో ఈ విషయాన్ని లీక్ చేశాడు.
Also Read: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..మిడిల్ ఈస్ట్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్న అమెరికా..