/rtv/media/media_files/2025/06/11/Xqgq9GEzS1pmTOcArWgy.jpg)
ICE Protest In LA
లాస్ ఏంజెలెస్ లో సరిగ్గా ఆరు రోజుల క్రితం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. దాదాపు వంద మందిని అరెస్ట్ చేశారు. ఇవి ముఖ్యంగా లాటినో జాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరిగాయి. వారు పని చేస్తున్న ఫ్యాక్టరీలు, హోమ్ డిపో, రెస్టారెంట్ల మీద దాడులు నిర్వహించారు. దీంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. ట్రంప్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న అక్రమవలస అణివేతకు నిరసనగా వేలమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. రోడ్లు నాశనం చేశారు, వాహనాలు తగులబెట్టారు, షాప్ లు లూటీ చేశారు...ఇమ్మగ్రేషన్ భవనానని ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఈరోజు వరకూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అణచడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ గార్డ్స్‌ను పంపింది. మెరైన్ లను రంగంలోకి దింపింది. అయినా కూడా నిరసనలు తగ్గలేదు. దీనికి ప్రతిగా పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, మరియు ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్లను ఉపయోగించారు. అనేక అరెస్టులు కూడా జరిగాయి.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
లాస్ ఏంజెలెస్ లోనే ఎందుకిలా..
యూఎస్ లో అతి పెద్ద రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. అందులో లాసం ఏంజెలెస్ అతి పెద్ద నగరం కూడా. ఇది అతి పెద్ద వలసదారుల నిలయం కూడా. ఇక్కడ సగం మంది లాటినోలు ఉన్నారు. దాంతో పాటూ మూడొంతుల మంది ఇతర దేశాల్లో పుట్టి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నవారు కూడా ఉన్నారు. దేశంలో మిగతా చోట్ల కూడా ఇలాంటి వారు ఉన్నారు. కానీ లాస్ ఏంజెలెస్ మొదట నుంచీ వలసదారులకు పుట్టిల్లు లాంటిది. అందుకే ఎక్కడా జరగని నిరసనలు ఇక్కడ జరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఇమ్మిగ్రేషన్ దాడుల వలన లాస్ ఏంజెలెస్ లో ఉన్న ప్రజలు వారి కుటుంబాలను పెద్ద సంఖ్యలోనే ప్రభావితం చేస్తాయి. వీటి వలన పని పోవడం, కుటుంబాలు విడిపోవడం...జీవనం అల్లకల్లోలం అవడం జరుగుతుంది. దీనికి లాస్ ఏంజెలెస్ లో ఉన్న లాటినోలు సిద్ధంగా లేరు. మరోవైపు కాలిఫోర్నియా ఒక సాంక్చురీ స్టేట్..అంటే శరణాలయ రాష్ట్రం. ఇందులో లాస్ ఏంజెలస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. దీని ప్రకారం ఇక్కడి స్థానిక పోలీసులు, అధికారులు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ తో సహకరించరు. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇదేమీ పట్టించుకోకుండా వారి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తోంది. దీని వలన అక్కడి ప్రజల్లో మరింత అభద్రతా భావం పెరుగుతోంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్, మేయర్ లాంటి వారు చెబుతున్నా కూడా ట్రంప్ పట్టించుకోవడం లేదు. కేవలం నేరచరిత్ర ఉన్నవారినే కాకుండా సాధారణ పౌరులపై కూడా దాడులు చేస్తున్నారు. ఇవన్నీ లాస్ ఏంజెలెస్ ప్రజలు ఆందోళనలు చేసేందుకు దారి తీసిన పరిస్థితులు. వీటన్నిటికీ తోడు లాస్ ఏంజెలస్ ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఇక్కడ ఏం జరిగినా చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. మీడియా దృష్టి ఎప్పుడూ ఈ నగరం మీదనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆందోళనలు దేశం మొత్తం వ్యాపించడానికి కూడా కారణం ఇదే. మీడియా, సోషల్ మీడియాల వలన లాస్ ఏంజెలెస్ నిరసనలు యూఎస్‌లోని మిగతా రాష్ట్రాలకూ పాకాయి. న్యూయార్క్, డాలస్, అట్లాంటా, ఆస్టిన్ లాంటి నగరాల్లో ఆందోళనలు జరిగేలా ప్రరేపించాయి.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
మెక్సికో సరిహద్దును మూసేస్తే ఏం జరుగుతుంది..
అక్రమ వలసదారులను పంపించేయడంతో పాటూ మెక్సికో సరిహద్దును కూడా మూసేస్తానని అంటున్నారు ట్రంప్. ఇది కూడా లాస్ ఏంజెలెస్ లో ఆందోళనలు జరగడానికి ఒక కారణంగా మారింది. మెక్సికో సరిహద్దును మూసివేస్తే లాస్ ఏంజిల్స్‌లోని లాటినో జనాభాకు, మొత్తం లాస్ ఏంజిల్స్ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. సరిహద్దు మూసివేత వల్ల కొత్త వలసలు ఆగిపోవడమే కాకుండా, ఇప్పటికే ఉన్న వలసదారుల కుటుంబ సంబంధాలపై, వారి ఉద్యోగాలపై, మరియు వారి కొనుగోలు శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. వారందరూ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. మెక్సికో సరిహద్దును మూయడం వలన వాణిజ్యం కూడా పడిపోతుంది. లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా అంతటా ఉన్న వ్యాపారాలు, ముఖ్యంగా వ్యవసాయం, తయారీ, సేవల రంగంలో అవసరమైన కార్మికులు, ముడిసరుకులు లేదా మార్కెట్లను కోల్పోతాయి. దీనివల్ల వస్తువుల కొరత ఏర్పడవచ్చు, ధరలు పెరగవచ్చు, అనేక మంది ఉద్యోగాలు కూడా కోల్పోవచ్చు. వీటన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే..చాలా మంది లాస్ ఏంజిల్స్‌లోని లాటినోలకు మెక్సికోలో లేదా సరిహద్దుకు ఆవతల కుటుంబ సభ్యులు ఉన్నారు. సరిహద్దు మూసివేత వలన కుటుంబాలు ఛిన్నాభిన్నం అయిపోతాయి. టోటల్ గా లాస్ ఏంజిల్స్‌లోని లాటినో కమ్యూనిటీతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థకు, సామాజిక సంబంధాలకు, సంస్కృతికి పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తుంది.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
ట్రంప్ కుర్చీకి ఎసరు..
లాస్ ఏంజెలెస్ ఆందోళనలు అధ్యక్షుడు ట్రంప్ కుర్చీకి ఎసరు పెట్టనున్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇలా చెప్పాపెట్టకుండా దాడులు చేయడం, నేషనల్ గార్డ్స్ ను మోహరించడం, కర్ఫ్యూ విధించడం లాంటి చర్యల వలన ట్రంప్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగులు, మరి కొందరు ఆయనపై కారాలు మియాలు నూరుతున్నారు. ఇప్పుడు ఈ ఆందోళనలతో మరింత వ్యతిరేకత మూటగట్టకున్నట్టు అవుతోంది. దాంతో పాటూ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రమైన కాలిఫోర్నియాలో ఇదంతా జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న గవర్నర్, మేయర్ లు కూడా ఆపార్టీకి చెందినవారే. ట్రంప్ వాళ్ళతోనే గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు ఆయనపై దావా వేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ కారణాలన్నీ ట్రంప్ పదవికి గంండగా మారే అవకాశం ఉందని అంటున్నారు. లాస్ట్ టైమ్ కూడా అధ్యక్ష పదవిలో ఉ్నప్పుడు ట్రంప్ మీద అభిశంసన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవకుండా ఆయన చూసుకుంటే మంచిదని చెబుతున్నారు.
today-latest-news-in-telugu | america president donald trump | ice raid protest los angeles