Iran: ట్రంప్ దొంగ దెబ్బ.. ఇరాన్ పై కొత్త కుట్ర!

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రోజురోజుకి కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్‌లో నిరసనలు చెలరేగడానికి ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

New Update
Trump

Trump

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రోజురోజుకి కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత నాలుగు రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పలువురిని అరెస్టు చేశాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్‌లో నిరసనలు చెలరేగడానికి ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.  

నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి ? 

ఇరాన్‌లో ఆదివారం నిరసనలు మొదలయ్యాయి. ఆ దేశ రియాల్ విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం, ఆర్థిక సంక్షోభం రావడంతో ఇరాన్‌ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు చేపట్టారు. శాంతియుతంగా నిరసనలు చట్టబద్ధమైనవని.. కానీ హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించమని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

 అయితే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారానికి ఈ నిరసనలు ముప్పుగా మారే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇరాన్‌ ప్రభుత్వ విధానాన్ని చూస్తే మాత్రం ఖమేనీ వెంటనే పదవిలో నుంచే దిగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC), భద్రతా సంస్థలు, మతపరమైన సంస్థల్లో ఖమేనీకి బలమైన మద్దతు ఉంది. 

ట్రంప్ కుట్ర ఉందా ?

ఇరాన్(iran) అణు కార్యక్రమం వల్ల అమెరికా-ఇరాన్‌ మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ట్రంప్(Donald Trump) అధికారంలోకి వచ్చాక ఇతర దేశాలు ఇరాన్‌ చమురును దిగుమతి చేసుకోకుండా ఒత్తిడి చేశారు. అలాగే ఇరాన్‌కు వెళ్లే నిధులు అడ్డుకునేందుకు ఇరానీయన్ బ్యాంకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా ఆంక్షలు విధించారు. ఇరాన్ తమ అనుకూల వర్గాలకు నిధులు చేరవేసే మార్గాలను మూసివేయాలని అమెరికా ట్రెజరీ శాఖను ఆదేశించారు. దీంతో ఇరాన్‌ క్రమంగా ఆర్థికంగా బలహీనపడుతూ వస్తోంది.

పరోక్షంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే అక్కడ నిరసనలు చెలరేగాయని నిపుణులు చెబుతున్నారు.  ఖమేనీని అధికారం నుంచి తొలగించాలని ట్రంప్ కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం.. అమెరికాకు అనుకూలంగా లేదు. అణు కార్యక్రమాల విషయంలో ఇరుదేశాల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖమేనీని పడగొట్టి తమకు అనుకూలంగా ఉన్నవారికి అధికారం వచ్చేలా చేయాలని ట్రంప్ కుట్ర పన్నినట్లు కూడా ప్రచారం నడుస్తోంది.     

Also Read: చెల్లికి క్యాన్సర్ అని నమ్మించి స్నేహితుడికి రూ.2 కోట్లు బురిడి కొట్టించిన కి 'లేడి'

2025లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగిన యుద్ధం కూడా ఇరాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ, అణు కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లాంటి వారు ఖమేనీ ఇక ఉనికిలో ఉండకూడదని బహిరంగంగా వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మరోవైపు ఖమేనీకి ఇప్పుడు 86 ఏళ్లు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తర్వాత అధికారం ఎవరికి వస్తుందనే దానిపై కూడా ఇరాన్‌ పాలకుల మధ్య అంతర్గత పోరు మొదలయ్యింది. 

Advertisment
తాజా కథనాలు