/rtv/media/media_files/2026/03/08/gulf-2026-03-08-16-06-18.jpg)
Over 52,000 Indians returned between March 1-7 after partial opening of airspace
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు భయాందోళన చెందుతున్నారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్లని వెనక్కి తీసుకొస్తోంది. ఈ నెల మొదటి వారంలో గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.
Also Read: భారత్ స్నేహం కోసం చైనా ఆరాటం.. డ్రాగన్ మనకు దగ్గరవ్వడానికి కారణమిదే!
పశ్చిమాసియాలో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. గల్ఫ్‌లో పలు ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పింది. దీంతో మార్చి 1 నుంచి 7 మధ్యలో 52 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. వీళ్లలో దాదాపు 32 వేల మంది భారతీయ విమానాల్లోనే వచ్చారు. రాబోయే రోజుల్లో మరికొన్ని విమాన సర్వీసులు రానున్నాయి.
Also Read: మేం ట్రంప్‌ను వదిలిపెట్టం.. ఇరాన్ సంచలన హెచ్చరిక!
అయితే విమాన సౌకర్యాలు లేని దేశాల్లోని భారతీయులు స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించింది. కేంద్రం విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపింది. అవసరమైన వాళ్లకి అండగా ఉండేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది.
Follow Us