/rtv/media/media_files/2025/09/14/pakistan-2025-09-14-12-57-36.jpg)
Inside Lashkar's Muridke Resurrection After Operation Sindoor With Pakistan's Help
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దాయది దేశం బుద్ధి మాత్రం మారలేదు. వరద బాధితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఎయిర్‌ఫోర్స్ ధ్వంసం చేసినటువంటి లష్కరే ప్రధాన క్యాంపు కార్యాలయం అయిన మర్కాజ్ తోయిబాను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నాయి.
Also Read: లండన్ లో మిన్నంటిన ఆందోళనలు..ఉద్యమం చేసిన వలన వ్యతిరేకవాదులు
ఆ ప్రాంతంలో ధ్వంసమైన లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం విభాగాలు తొలగించేందుకు దాన్ని చుట్టూ భారీ యంత్రాలు మోహరించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉగ్ర సంస్థ కార్యాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్లీ అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా ఉపయోగించనున్నట్లు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసమైన LETకి ఆగస్టులో పాకిస్థాన్ ప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు అందించింది. అయితే దీని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం సుమారు రూ.4.7 కోట్లకు పైగా ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయి.
Also Read: గాజాలో ఆగని మృత్యుఘోష...ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది మృతి
అయితే దీనికోసం నిధులు సేకరించేందుకు పాకిస్థాన్ కుట్రకు పాల్పడుతోంది. ఇందుకోసం వరద ప్రభావిత ప్రభావిత ప్రాంతల సాయం పేరుతో విరాళాలు సేకరించి ఉగ్రసంస్థలకు నిధులు మళ్లిస్తోంది. అయితే పాక్ ఇలాంటి దొంగబుద్ధికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. 2005లో పాక్‌లో భారీ భూకంపం సంభవించింది. అప్పుడు కూడా బాధితులకు సాయం పేరుతో ఇలానే నిధులు సేకరించి ఉగ్రసంస్థలకు నిధులు మళ్లించినట్లు భారత వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో ఇలా మానవతా సాయం పేరుతో సేకరించిన బిలియన్ డాలర్లు నగదులో దాదాపు 80 శాతాన్ని ఉగ్రసంస్థ LETలో మౌలిక సదుపాయాల కోసం మళ్లించినట్లు పేర్కొన్నాయి .
Also Read: విమానాన్ని హైజాక్ చేసిన నేపాల్ ప్రధాని సుశీల కర్కి భర్త ఒక కిడ్నాపర్ అని మీకు తెలుసా?
ఇదిలాఉండగా మురీద్కేలో మర్కాజ్ అనేది ఒక పెద్ద ఉగ్రస్థావరం. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించి ఉన్న లష్కరే క్యాంపు కార్యాలయం సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో మార్కెట్, మదర్సా వంటివి కూడా ఉన్నాయి. ఇలా ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపే కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు వెయ్యి మంది దాకా ఇక్కడ ఉగ్ర శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో అతిథి గృహ నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షల విరాళం ఇచ్చాడు. 2008లో జరిగిన 26/11 ముంబయి ఉగ్రదాడి సంచలనం రేపిన సంగతి తెలసిందే. ఈ కాల్పులకు పాల్పడ్డవారిలో కీలక ఉగ్రవాదైన అజ్మల్ కసబ్‌కు కూడా ఇక్కడే శిక్షణ ఇచ్చారు .
Also Read: నర్స్ తో సె*క్స్ కోసం..ఆపరేషన్ ను మధ్యలో వదిలేసిన పాకిస్తాన్ డాక్టర్