UK: లండన్ లో మిన్నంటిన ఆందోళనలు..ఉద్యమం చేసిన వలన వ్యతిరేకవాదులు

లండన్ లో శనివారం చాలా పెద్ద యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీ జరిగింది. దాదాపు లక్ష మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. దాంతో పాటూ జాత్యాహంకారానికి వ్యతిరేకంగా కూడా ఆందోళనలు జరిగాయి. ఇందులో పోలీసుల మీద దాడులు జరిగాయి.

New Update
UK

London Protest

నిన్న లండన్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. చరిత్రలోనే అతి ర్యాలీని నిర్వహించారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్ డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో సమాంతరంగా జాత్యాహంకారానికి వ్యతిరేకంగా కూడా స్టాండ్ అప్ టు రేసిజమ్ అనే మరో నిరసన కూడా జరిగింది. వలసలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో దాదాపు లక్ష మంది పాల్గొన్నారు. జాత్యాహంకార వ్యతిరేక ప్రదర్శనలో 5వేల మంది పార్టిసిపేట్ చేశారు. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించారు. నిరసనకారులు చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు , పోలీసులకు మధ్య గొడవ జరిగింది. పోలీసుల పైకి వాటర్ బాటిళ్ళు, వస్తువుల తోటి దాడులు చేశారు. ఇందులో 26 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఎలాన్ మస్క్ సైతం..

ఈ మొత్తం ప్రదర్శనలో యూకేతోపాటూ అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు కూడా కనిపించాయి. యూకే ప్రధాని కీర్స్టార్మర్‌ కు వ్యతిరేంగా కూడా ఆందోళనకారులు నిరసనలు చేశారు. ఆయనను వెనక్కు పంపించేయలని డిమాండ్ చేశారు. మరికొంత మంది మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. దీంతో పాటూ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే టామీ రాబిన్సన్ నిర్వహించిన ఈ ర్యాలీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా మాట్లాడారు. 

Also Read: Boxing: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం

Advertisment
తాజా కథనాలు