/rtv/media/media_files/2025/07/21/indian-origin-doctor-in-us-charged-with-medical-fraud-2025-07-21-12-21-25.jpg)
Indian-Origin Doctor In US Charged With Medical Fraud
యూకేలో ఓ పాకిస్తాన్ డాక్టర్ పై కేసు నడుస్తోంది. దానికి కారణం ఆయన తన డ్యూటీని మర్చిపోవడమే. యూకేలోటేమ్ సైడ్ జనరల్ ఆసుపత్రిలో పాకిస్తాన్ కు చెందిన అంజుమ్కన్సల్టెంట్ అనెస్థీషియాలజిస్ట్. ఈయన 2023 సెప్టెంబర్ 16న ఆసుపత్రిలో ఆపరేషన్ ను వదిలే బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించాడు. నర్స్ తో సెక్స్ కోసం ఆపరేషన్ టేబుల్ పై రోగిని వదిలేసి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత నర్స్ తో ఉండగా దొరికేశాడని డెయిలీ పత్రిక తెలిపింది. ఇతనిపై మెడికల్ ట్రిబ్యూనల్ లో కేసు నడుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అంజుమ్యూకే విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లో వైద్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే మంచెస్టర్ లో ట్రిబ్యునల్ మాత్రం అంజుమ్ పై కేసు నడుస్తూనే ఉంది. ఇందులో తీర్పు వస్తే అంజుమ్ డాక్టర్ పట్టాను రద్దు చేసే అవకాశం ఉంది.
ఆపరేషన్ ను మధ్యలోనే వదిలేసి..
అంజుమ్ ఆపరేషన్ థియేటర్ ను వదిలేసి నర్స్ తో ఉండడాన్ని మరొక నర్స్ ప్రత్యక్షంగా చూశారు. ఆమె ఈ విషయాన్ని తరువాత కంప్లైంట్ చేసింది. తాను చూసేటప్పటికి డాక్టర్ అంజుమ్ తన ప్యాంటు ముడి వేసుకోవడాన్ని చూశానని నర్స్ తెలిపారు. పిత్తాశయాన్ని తొలగించడానికి కీహోల్ సర్జరీ చేస్తున్న రోగిని వదిలి వెళ్ళాడని మాంచెస్టర్‌లోని ట్రిబ్యునల్ ముందు ఆమె చెప్పింది. ఈ కేసులో జనరల్ మెడికల్ కౌన్సిల్ తరపున ఆండ్రూ మొల్లాయ్, మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ విచారణలో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 16న థియేటర్ ఫైవ్‌లో ఐదు శస్త్రచికిత్సలకు అంజుమ్అనస్థీషియాలజిస్ట్‌గా చేశారు. అప్పుడే ఆయన ఈ పనికి పాల్పడ్డారని చెప్పారు. మూడవ ఆపరేషన్ సమయంలో ఆయన బయటకు వెళ్ళారని తెలిపారు. బాత్రూంకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళారని మొల్లాయ్ చెప్పారు.
నేను సిగ్గుపడుతున్నాను..
తాను తప్పు చేశానని డాక్టర్ అంజుమ్ కూడా అంగీకరించారు. అదొక దురదృషటమైన రోజని...దానికి తాను ఎంతో సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఈ ర్చకు తనను క్షమించాలని వేడుకున్నారు. తన తప్పును పూర్తిగా తెలుసుకున్నానని అంజుమ్ అన్నారు. ఇలాంటిది మళ్ళీ జరగదని చెప్పుకొచ్చారు. లాహోర్‌లోని హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం నుండి 2004లో గ్రాడ్యుయేట్ అయిన సుహైల్ అంజుమ్...వైద్య వృత్తి కోసం యూకే వచ్చారు 2011 నుంచి అతను అక్కడే పని చేస్తున్నారు. బ్రిస్టల్, మిల్టన్ కీన్స్, డార్ట్‌ఫోర్డ్‌లలో పదవులు నిర్వహించి, 2015లో టేమ్‌సైడ్, గ్లోసాప్ ఇంటిగ్రేటెడ్ ట్రస్ట్‌లో చేరారు.
Also Read: Manipur: 2023 అల్లర్ల తర్వాత మొదటిసారి మణిపూర్ కు ప్రధాని మోదీ..ఈరోజే