Sushila Karki: విమానాన్ని హైజాక్ చేసిన నేపాల్ ప్రధాని సుశీల కర్కి భర్త ఒక కిడ్నాపర్ అని మీకు తెలుసా?

నేపాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సుశీల కర్కి భర్త పేరు దుర్గా ప్రసాద్ సుబేది. గతంలో నేపాల్ విమానం హైజాక్ చేశారు. ప్రభుత్వ నిధులు కోసం హైజాక్ చేయడంతో రెండేళ్ల పాటు అతన్ని జైలులో కూడా ఉంచినట్లు సమాచారం.

New Update
Sushila Karki

Sushila Karki

నేపాల్‌లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేయడంతో జెన్ Z యువత దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పార్లమెంట్‌తో పాటు ప్రధాని ఇంటిపై దాడి చేశారు. దీంతో ప్రధాని కేపీ శర్మ పదవికి రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. జెన్ Z యువత అల్లర్లు ఎక్కువగా సృష్టించడంతో  అత్యవసర పరిస్థితి విధించారు. ఇక నేపాల్ తాత్కలిక ప్రధాన మంత్రిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడి కార్యాలయంలో 73 ఏళ్ల సుశీల కర్కితో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత వచ్చే ఎన్నికల వరకు సుశీల కర్కి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. అయితే సుశీల కర్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: BREAKING: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఖరారు.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

విమానం హైజాక్‌లో నేపాల్ ప్రధాని భర్త..

నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి, మహిళా ప్రధానమంత్రి కూడా సుశీల కర్కినే. ఈమె భర్త పేరు దుర్గా ప్రసాద్ సుబేది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సుశీలా కర్కి ఆయనను కలిశారు. అయితే 52 ఏళ్ల క్రితం నేపాల్‌లో జరిగిన మొదటి విమాన హైజాక్‌లో సుశీల భర్త సుబేది కూడా ఉన్నారు. నేపాల్‌లోని బిరత్‌నగర్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ఓ విమానాన్ని 1973లో హైజాక్ చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు కెనడాలో తయారు చేసిన 19 సీట్ల ట్విన్ ఓటర్ విమానాన్ని హైజాక్ చేశారు.  అందులో ప్రభుత్వానికి చెందిన రూ.30 లక్షల రూపాయలు ఉన్నాయి. 

విమానంలో ప్రయాణీకులలో నేపాల్‌కు చెందిన వారితో పాటు భారత్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. సుబేదితో పాటు నాగేంద్ర ధుంగెల్, బసంత్ భట్టారాయ్ రాయల్ ఈ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్‌లో పాల్గొన్నారు. నేపాల్‌లో జరిగిన మొదటి విమాన హైజాక్ కూడా ఇదే. నేపాల్ రాజు మహేంద్ర పాలనలో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి నిధులు సేకరించడానికి ఈ విమాన హైజాక్ జరిగింది. హైజాక్ చేసిన విమానంలో రూ.30 లక్షల విలువైన ప్రభుత్వ నిధులు ఉండటంతో హైజాకర్లు పైలట్‌ను బీహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లోని గడ్డి మైదానంలో బలవంతంగా దింపారు. ఆ తర్వాత విమానాన్ని వదిలేశారు. ఆ తర్వాత సుబేదిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్నేళ్ల తర్వాత వారు జైలు నుంచి విడుదలయ్యారు. 

ఇది కూడా చూడండి: Nepal: నేపాల్ తాత్కాలిక ప్రభత్వ సారథిగా సుశీలా కర్కి ప్రమాణం

Advertisment
తాజా కథనాలు