/rtv/media/media_files/2025/05/21/QyVKSd34iDDnFazzqkQF.jpg)
Sindh Home Minister House
Indus River : పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లో నేటికి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ పై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో భారత్ సిందూ జలాలను నిలిపివేసింది.ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు సింధూ జలలు రాకపోవడంతో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. తమకు నీళ్లు కావాలని రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అలాగే ఇండస్ నదిపై నిర్మించిన వివాదాస్పద చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ వల్ల కూడా తమకు నష్టం కలుగుతుందని బావించిన స్థానికులు కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా నౌషెహ్రో ఫిరోజ్ జిల్లాలోని మోరో పట్టణంలో సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిరసన కారులు నిప్పుపెట్టారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..
పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆగ్రహంతో నిరసన కారులు సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటిపై దాడి చేశారు. ఇంటిలోకి వెళ్లి గదులు, ఫర్నీచర్‌కు నిప్పంటించి తగలబెట్టారు. పైకప్పు నుంచి స్ల్పిట్ ఎయిర్ కండిషనర్ల బయటి భాగాలను కూడా నేలపైకి విసిరారు. దీంతో హోమంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగకమ్ముకుంది. మరోవైపు.. మోరో పట్టణంలో జరిగిన హింసపై సింధ్ హోంమంత్రి దర్యాప్తునకు ఆదేశించారు. నవాబ్షా, దాదు, హైదరాబాద్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పోలీసు బృందాలు పట్టణానికి చేరుకుని స్థానిక పోలీసులతో కలిసి శాంతిభద్రతలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి మరణించగా.. ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నేతృత్వంలోని సింధ్ ప్రభుత్వానికి, కేంద్రంలోని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య చోలిస్తాన్ కాలువల అంశం కీలకమైన వివాదంగా మారింది. చోలిస్తాన్ ప్రాంతానికి సాగునీరు అందించడానికి సింధు నదిపై ఆరు కాలువలను నిర్మించాలని సమాఖ్య ప్రభుత్వం బావించింది. అయితే ఈ ప్రాజెక్టును దాని ప్రధాన మిత్రపక్షమైన పీపీపీ, ఇతర సింధ్ జాతీయవాద పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆందోళనకారులు నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మోరో పట్టణానికి చెందిన ఒక జాతీయ వాద సంస్థ సింధు కాలువలు, కార్పొరేట్ వ్యవసాయం, ఇతర సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆందోళన కారులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఉద్రిక్తత చెలరేగింది.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..