Indus Waters : మిస్టర్ మోదీ..సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుంది: బిలావల్ భుట్టో హెచ్చరిక
పాక్ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో భారత్‌పై నోరు పారేసుకున్నారు. సుక్కూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్‌ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు.