London: లండన్ లో జాత్యాహంకారం...గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో పిచ్చిరాతలు

లండన్ లో జాత్యాహంకారం మితి మీరిపోయింది. భారతీయులపై వివక్షను మరోసారి బయట పెట్టారు. అక్కడ గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు రాస్తూ తమ బుద్ధిని బయటపెట్టుకున్నారు. 

New Update
london gandhi

The High Commission of India has strongly condemned the vandalism of Mahatma Gandhi's statue at Tavistock Square in London

లండన్(london) లోని టివిస్టాక్ స్క్వేర్ దగ్గర మహాత్మాగాంధీ విగ్రహం(Mahatma Gandhi Statue) ఉంటుంది.  అక్టోబర్ 2న ఇక్కడే గాంధీ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఇప్పుడు దానిపైనే గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీతో పిచ్చి రాతలు రాశారు.   అక్టోబర్ 2 దగ్గరలో ఉండడం వల్లనే ఈ పనులు చేశారని తెలుస్తోంది. గాంధీ విగ్రహంపై భారత్ వ్యతితరేక రాతలు రాశారు.  దీనిని లండన్ లోని భారత కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది.   ఈచర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

Also Read :  ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్..100 మంది శిథిలాల కింద

మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి..

గాంధీ జయంతి(gandhi-jayanthi) కి రెండు రోజుల ముందు ఇలా జరగడం బాధాకరమని భారత రాయబార కార్యాలయం అంది. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదు. మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడని చెప్పింది.  దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరింది.  గాంధీ విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని రాయబార కార్యాలయం చెప్పింది. 

Also Read: Israel-Hamas: అమెరికా చెప్పింది.. యుద్ధం ఆపేస్తా..నెతన్యాహు

Advertisment
తాజా కథనాలు