/rtv/media/media_files/2025/08/16/alaska-meet-2025-08-16-06-57-55.jpg)
No Talks About Tariffs
No Tariffs Talks: అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సమావేశం జరిగింది. ఆరు, ఏడు గంటల పాటూ జరుగుతాయని అనుకున్న చర్చలు మూడు గంటల్లోపునే ముగిశాయని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. మీటింగ్ గురించి ఇద్దరు దేశాధినేతలూ పాజిటివ్ గానే చెప్పారు. గొప్ప పురోగతిని సాధించామని ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ పై మాత్రం ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు. మరోసారి రష్యాలో పుతిన్ ను కలుస్తానని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు తాను యుద్ధ ముగింపుకు సానుకూలంగానే ఉన్నానని తెలిపారు.
సుంకాలపై నోరు విప్పని అధినేతలు..
ఉక్రెయిన్ యుద్ధంతో పాటూ చాలా విషయాలు చర్చకు వచ్చాయని ట్రంప్ , పుతిన్ ఇద్దరూ చెప్పారు. అయితే ఏ ఒక్కరూ మాత్రం సుంకాల(Trump Tariffs) విషయంపై నోరు విప్పలేదు. అసలు దాని గురించే చర్చకు రాలేదని తెలుస్తోంది. ట్రంప్, పుతిన్ భేటీ ఖరారు అయిన దగ్గర నుంచీ అందరూ ఉక్రెయిన్ యుద్ధంతో పాటూ సుంకాల విషయం గురించి మాట్లాడుకున్నారు. రష్యా శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే భారత్ పై సుంకాలు ఉండవని భావించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆవిధంగానే సిగ్నల్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే అసలు విషయం గురించే ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో భారత్ కు టారీఫ్ ల మోత తప్పదని అంటున్నారు. ఇండియాపై అదనపు సుంకాలు అమలు అవడానికి ఇంకా కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆగస్టు 27 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
సమావేశానికి ముందు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అలస్కా విమానాశ్రయంలో ఆహ్వానం పలికారు. ఇద్దరు నేతలూ పరస్పర కరచాలనం చేసుకున్నారు. తర్వాత ఒకే కారులో భేటీ అయ్యే చోటు యాంకరేజ్ కు కలిసి వెళ్ళారు. అయితే సమావేశానికి ముందు అటు ట్రంప్, ఇటు పుతిన్ ఇద్దరూ పెద్దగా ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు శాంతి కోసమే సమావేశం అని చెప్పగా..పుతిన్ మాత్రం కాల్పుల విరమణకు సంబంధించిన ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పకుండానే లోనికి వెళ్ళిపోయారు. మరోవైపు ఇరుదేశాధినేతలూ సమావేశమైన యాంకరేజ్ లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీ-2 స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్‌ల చక్కర్లు కొట్టాయి.
Also Read: Bowler Shami: కూతురును పట్టించుకోవడం లేదు..భారత పేసర్ షమీ పై భార్య సంచలన ఆరోపణలు